
అపర కుబేరుడు, కలియుగ వైకుంఠనాథుడు.. ఆయనకున్న ఆస్తులు, సంపద వెలకట్టలేనివి. అయినా నిత్యం భక్తులు సమర్పించే కానుకలతో ఆయన ఖజానాకు రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చి చేరుతోంది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం ఏటేటా పెరుగుతూ పాత రికార్డులను బ్రేక్ చేస్తోంది. తాజాగా టీటీడీ విడుదల చేసిన లెక్కల ప్రకారం.. ఈ ఏడాది గడిచిన 9 నెలల్లోనే స్వామివారి హుండీ ద్వారా రూ. 1,129.04 కోట్ల మేర ఆదాయం టీటీడీ ఖజానాకు చేరింది.
రోజుకు 75 నుంచి 80 వేల మంది దర్శనం
తిరుమలేశుడి మొత్తం రాబడిలో హుండీ ఆదాయమే అత్యంత కీలకం. భక్తుల రద్దీతో నిత్యం కిటకిటలాడే తిరుమల కొండపై.. సగటున రోజుకు దాదాపు 75 వేల నుంచి 80 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులు తమ మొక్కుల రూపంలో భారీగా కానుకలు సమర్పిస్తుండటంతో హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది ప్రతి నెలా సగటున రూ. 125 కోట్లకు పైగానే రాబడి వస్తుండటం విశేషం.
టీటీడీ చరిత్రలోనే సరికొత్త రికార్డు
ఈ ఏడాది వచ్చిన ఆదాయంలో జూలై నెల ఆదాయం టీటీడీ చరిత్రలోనే సరికొత్త మైలురాయిగా నిలిచింది. జూలై 1 నుంచి 31 వరకు మొత్తం 24.52 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, ఏకంగా రూ. 140.25 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. గత రికార్డులన్నింటినీ అధిగమించి ఈ ఏడాదిలోనే అత్యధిక నెలవారీ ఆదాయంగా ఇది నమోదైంది.
నెలలవారీగా శ్రీవారి హుండీ ఆదాయం వివరాలు
సింగిల్ డే రికార్డులు ఇవే..
ఈ ఏడాది ఒకే రోజు అత్యధికంగా సెప్టెంబర్ 10వ తేదీన రూ. 6.94 కోట్ల హుండీ ఆదాయం రాగా, అత్యల్పంగా మార్చి 4వ తేదీన రూ. 1.47 కోట్ల ఆదాయం నమోదైనట్లు టీటీడీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.