TTD: ద‌గ్గు, జ‌లుబు ఉంటే తిరుమ‌ల రావొద్దు… ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకున్న‌వారికి ఆప్ష‌న్ ఇచ్చిన టీటీడీ..

|

Apr 19, 2021 | 9:41 AM

TTD To Devotees: క‌రోనా సెకండ్ వేవ్ త‌న ప్ర‌తాపాన్ని కొన‌సాగిస్తోంది. భారీ సంఖ్య‌లో కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్ర‌భుత్వాలు, అధికారులు దిద్దుబాటు చ‌ర్య‌లు మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలో తిరుమ‌ల...

TTD: ద‌గ్గు, జ‌లుబు ఉంటే తిరుమ‌ల రావొద్దు... ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకున్న‌వారికి ఆప్ష‌న్ ఇచ్చిన టీటీడీ..
Ttd About Corona
Follow us on

TTD To Devotees: క‌రోనా సెకండ్ వేవ్ త‌న ప్ర‌తాపాన్ని కొన‌సాగిస్తోంది. భారీ సంఖ్య‌లో కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్ర‌భుత్వాలు, అధికారులు దిద్దుబాటు చ‌ర్య‌లు మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలో తిరుమ‌ల వ‌చ్చే భ‌క్తుల‌కు టీటీడీ కొన్ని సూచ‌న‌లు చేసింది. ద‌గ్గు, జ‌లుబు వంటి అనారోగ్య స‌మ‌స్య‌లున్న భ‌క్తులు తిరుమ‌ల యాత్ర‌ను వాయిదా వేసుకోవాల‌ని తెలిపింది. మ‌రి ఇప్ప‌టికే ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకున్న‌వారి ప‌రిస్థితి ఏంటి.. అన్న ప్ర‌శ్న‌లు తలెత్తున్నాయి. ఈ నేప‌థ్యంలో వీరికి టీటీడీ ఒక ఆప్ష‌న్ ఇచ్చింది.
ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులు కొవిడ్‌ కారణంగా రాలేని పరిస్థితుల్లో ఉంటే రానున్న 90 రోజుల వరకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇక క‌రోనా నియంత్ర‌ణ‌లో భాగంగా.. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. కరోనా వ్యాప్తి వేగంగా ఉండటంతో ఏప్రిల్‌ 11 నుంచి టైం స్లాట్‌ టోకెన్ల కోటాను కూడా రద్దు చేశారు. మే నెలకు సంబంధించిన రూ.300 దర్శన టికెట్ల కోటాను మంగళవారం ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా రోజుకు 25 వేలుగా ఉన్న కోటాను 15 వేలకు కుదించనున్నట్టు స‌మాచారం.

Also Read: Remdesivir: ‘రెమిడెసివిర్‌’ను ఆ దేశం నుంచి తెచ్చుకుంటాం.. అనుమతివ్వండి.. కేంద్రాన్ని కోరిన జార్ఖాండ్ సీఎం

రవితేజ సినిమాపై కరోనా ఎఫెక్ట్.. వాయిదా పడిన మాస్ మాహరాజా మూవీ.. తిరిగి ఎప్పుడు ప్రారంభమంటే..

Couple Murder: నల్లగొండ జిల్లాలో దారుణం.. ఆరు బయట నిద్రిస్తున్న దంపతుల దారుణ హత్య.. కారణం అదేనా?