ప్రకాశం బ్యారేజ్ వద్ద కలకలం.. పోలీసుల అప్రమత్తతతో ముగ్గురు ప్రాణాలను సేఫ్..!

ఒక్క క్షణం ఆలస్యం జరిగి ఉంటే.. మూడు ప్రాణాలు కృష్ణా జలాల్లో కలిసిపోయేవి. కానీ సమయానికి స్పందించిన బెజవాడ పోలీసులు ఆ విషాదాన్ని అడ్డుకుని ఒక కుటుంబాన్ని మళ్లీ జీవితానికి చేర్చారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రకాశం బ్యారేజ్ వద్ద కలకలం.. పోలీసుల అప్రమత్తతతో ముగ్గురు ప్రాణాలను సేఫ్..!
Police Save Family

Edited By:

Updated on: Feb 14, 2026 | 10:26 AM

ఒక్క క్షణం ఆలస్యం జరిగి ఉంటే.. మూడు ప్రాణాలు కృష్ణా జలాల్లో కలిసిపోయేవి. కానీ సమయానికి స్పందించిన బెజవాడ పోలీసులు ఆ విషాదాన్ని అడ్డుకుని ఒక కుటుంబాన్ని మళ్లీ జీవితానికి చేర్చారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్థాపానికి గురైన కృష్ణా జిల్లా చిలకలపూడి చెందిన ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి మౌనంగా విజయవాడకు చేరుకుంది. ఇంట్లో చనిపోతాను అని చెప్పి బయలుదేరిన ఆమె గురించి పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన చిలకలపూడి పోలీసులు విజయవాడ కంట్రోల్ రూమ్‌ను అలర్ట్ చేశారు. కంట్రోల్ రూమ్ ఇన్స్‌పెక్టర్ ఆ సమాచారం అందుకున్న వెంటనే నగరంలోని సంబంధిత పోలీస్ స్టేషన్లో , ట్రాఫిక్ బృందాన్ని అప్రమత్తం చేశారు.

ఇంతలో ప్రకాశం బ్యారేజిపై ఆ మహిళ తన ఇద్దరు చిన్నారులతో నిలబడి ఆత్మహత్యాయత్నానికి సిద్ధమైంది. పరిస్థితి తీవ్రతను గమనించిన ట్రాఫిక్ ఆర్ఎస్ఐ శ్రీధర్, హెడ్ కానిస్టేబుల్ భూషణం ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ముందుకు దూకారు. చాకచక్యంగా స్పందించి మహిళను చిన్నారులను సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు. ఆ క్షణంలో చోటు చేసుకున్న ఆందోళన పరుగులు ఆపదలో ఉన్న పిల్లల ఏడుపు అన్ని క్షణాల్లోనే జరిగిపోయాయి.

పోలీసులు తక్షణం స్పందించి ముగ్గురు ప్రాణాలు కాపాడారు. అనంతరం వారిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించి తదుపరి చర్యలను చేపట్టారు.. ఈ సంఘటన పై విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్పందిస్తూ.. విషమ పరిస్థితుల్లో పోలీసులు చూపిన అప్రమత్తను అభినందించారు. సమయానికి స్పందిస్తే ఎంతటి విషాదంనైనా నివారించవచ్చుని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us