Srisailam Temple: శ్రీశైలంలో దారుణం.. అన్నదాన సత్రంలో వ్యక్తిని కొట్టి చంపిన యాత్రికులు.. చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు..

శ్రీశైలం పుణ్య క్షేత్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ సత్రం జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి చనిపోయాడు. ప్రత్యక్ష సాక్షులు..

Srisailam Temple: శ్రీశైలంలో దారుణం.. అన్నదాన సత్రంలో వ్యక్తిని కొట్టి చంపిన యాత్రికులు.. చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు..

Updated on: Dec 29, 2020 | 7:58 PM

Srisailam Temple: శ్రీశైలం పుణ్య క్షేత్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ సత్రం జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి చనిపోయాడు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన నరసారావుపేటకు చెందిన నలుగురు యాత్రికులు మద్యం సేవించి వచ్చారు. ఈ క్రమంలో సత్రంలోని అన్నదాన మందిరంలో పని చేస్తున్న బొడ్డు శ్రీనుతో వాగ్వాదానికి దిగారు. అలా అతనిపై నలుగురు యాత్రికులు చేయి చేసుకున్నారు. ఒకరినొకరు తోసుకున్నారు. ఆ క్రమంలో బొడ్డు శ్రీనుపై సత్రంలోని టేబుళ్లు పడ్డాయి. ఆ వెంటనే నలుగురు దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే శ్రీనును స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా, పారిపోయిన దుండగులను శ్రీశైలం పోలీసులు వెంబడించారు. సున్నిపెంట గ్రామం వద్ద ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Also read:

chaysam pics viral: వైరల్‌గా మారిన సమంత, నాగచైతన్య ఫొటోలు.. న్యూ ఇయర్ వేడుక కోసమే వీరి ప్రయాణం..

కేంద్ర ర‌వాణా శాఖ కీల‌క నిర్ణ‌యం.. కార్ల‌లో ఎయిర్ బ్యాగులు త‌ప్ప‌నిస‌రి.. ఎప్ప‌టి నుంచి అంటే..