Andhra Pradesh: రూ.50కే సబ్సిడీ టమాటా.. కిలో మీటర్ల మేర బారులు తీరిన క్యూ లైన్లు.. తీరా దగ్గరికెళితే..!

| Edited By: Jyothi Gadda

Aug 02, 2023 | 12:26 PM

వారానికి ముందు రైతు మార్కెట్ లో కేజీ టమోటో ధరలు 100 రూపాయలు ఉండేవి కాస్త ఇప్పడూ 150 కు చేరుకున్నాయి. నిన్న150 ఉన్న కేజీ టమాటాలు ఇవాళ 145 కు వచ్చాయి. నిన్న ఒక్కరోజే దాదాపు కేజిపై 20 రూపాయలు ధర పెరిగిందంటే పరిస్థితి ఎలా ఉందొ అర్ధమైపోతుంది. రైతు మార్కెట్ లోనే ఇంత దారుణమైన ధరలు ఉంటే రిటైల్ మార్కెట్‌లో డబుల్ సెంచరీ దాటేశాయి టమాటా రేట్లు. చాలా మార్కెట్లలో అయితే గడిచిన వారం రోజులుగా అసలు టమోటాలు కనిపించలేదు. పెరిగిన రేట్లతో

Andhra Pradesh: రూ.50కే సబ్సిడీ టమాటా.. కిలో మీటర్ల మేర బారులు తీరిన క్యూ లైన్లు.. తీరా దగ్గరికెళితే..!
Tomato Price
Follow us on

విజయవాడ, ఆగస్టు02, ఆకాశాన్ని అంటిన టమాటా ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతుంటే.. మరోవైపు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ టమాటా కష్టాలు మాములుగా లేవు….గత వారం రోజులుగా విజయవాడ వ్యాప్తంగా ప్రభుత్వం అందించే 50 రూపాయల సబ్సిడీ టమాటాలు రాకపోవటంతో అల్లాడారు జనం. ఇవాళ మార్కెట్ కు సబ్సిడీ టమాటాలు రావటంతో అన్ని మార్కెట్లలో కిలో మీటర్ల మేర క్యూ లైన్స్ దర్శనం ఇచ్చాయి. ఉదయం ఏడు గంటల నుండే క్యూ లైన్లలో టమాటాల కోసం వేచి ఉన్నారు పబ్లిక్. విజయవాడలో వున్న అన్ని ప్రధాన రైతు మర్కెట్లలో ఇదే పరిస్థితి నెలకొంది.

వారానికి ముందు రైతు మార్కెట్ లో కేజీ టమోటో ధరలు 100 రూపాయలు ఉండేవి కాస్త ఇప్పడూ 150 కు చేరుకున్నాయి. నిన్న150 ఉన్న కేజీ టమాటాలు ఇవాళ 145 కు వచ్చాయి. నిన్న ఒక్కరోజే దాదాపు కేజిపై 20 రూపాయలు ధర పెరిగిందంటే పరిస్థితి ఎలా ఉందొ అర్ధమైపోతుంది. రైతు మార్కెట్ లోనే ఇంత దారుణమైన ధరలు ఉంటే రిటైల్ మార్కెట్‌లో డబుల్ సెంచరీ దాటేశాయి టమాటా రేట్లు. చాలా మార్కెట్లలో అయితే గడిచిన వారం రోజులుగా అసలు టమోటాలు కనిపించలేదు. పెరిగిన రేట్లతో రైతు బజార్ బోర్డు ధర గిట్టుబాటు కాకా బయికాట్ చేసారు వ్యాపారాలు…రిటైల్ మార్కెట్ లో మిగిలిన కూరగాయలు కొంటేనే టొమాటోలు అమ్ముతాం అని రూల్ కూడా పెట్టారు వ్యాపారులు. దాంతో సబ్సిడీ టమాటాలు కోసం ప్రజలు పడిగాపులు కాస్తున్నారు.

ఒక్క మనిషికి 2కిలోల చొప్పున మాత్రమే ఇస్తున్న 50 రూపాయల టమాటాల కోసం పనులన్నీ మానేసుకుని రేషన్‌ షాపు వద్ద, లేదంటే, ఒకప్పుడు నళ్లా నీటి కోసం క్యూ లైన్లలో నిలబడినట్టుగా తెల్లవారకముందే సబ్సిడీ టమాటాల కోసం క్యూ కడుతున్నారు జనాలు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి తీసుకున్న టమాటాలు.. తీరా ఇంటికి వెళ్లి చూస్తే.. నాసిరకం, కుళ్ళిన టమాటాలు ఉంటున్నాయని వాపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..