Tomato Price: వేసవిలో ఎండలు (Summer Season) మండిస్తున్నాయి. తీవ్ర ఎండలకు కూరగాయల పంటలు వాడిపోతున్నాయి. దీంతో దిగుబడి తగ్గింది. ధరలు పెరిగాయి. ముఖ్యంగా టమాటా(Tomato) పంటలపై ఎండలు తీవ్ర ప్రభావం చూపించడంతో.. దిగుబడి తగ్గి.. ధరలకు పెరుగుతున్నాయి. ఆంధప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పలమనేరు మార్కెట్‌లో టమోటా ధరలు పెరిగాయి. మూడురోజుల క్రితం 14 కిలోల క్రేట్ కేవలం రూ.200 లు ఉంది. అయితే బుధవారం ఏకంగా రూ.400కు చేరుకుంది. టమాటా ధరలు పెరగడానికి కారణం..ఓ వైపు టమోటా దిగుబడి తగ్గడం.. మరోవైపు పొరుగు జిల్లాలనుంచి కూడా టమోటాలు రావడం లేదని.. అందుకనే ఒక్కసారిగా మార్కెట్ లో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.
అంతేకాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే.. రెండునెలలు పాటు టమోటాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. టమోటా ధరలు రెండునెలల తరువాత పెరుగుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: UK PM Johnson: నేడు అహ్మదాబాద్‌కు చేరుకోనున్న బ్రిటన్ ప్రధాని.. రేపు ప్రధాని మోడీతో సమావేశం