తిరుమల నడక మార్గంలో కలకలం చెలరేగింది. గుర్తుతెలియని వ్యక్తి అధికారులు గుర్తించారు. . అలిపిరి మార్గంలోని నరసింహ స్వామి టెంపుల్ సమీపంలో 2 రోజులుగా దుర్వాసన వస్తూ ఉండటంతో.. స్థానిక వ్యాపారులు అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో టీటీడీ సిబ్బంది ఆ ప్రాంతంలో వెతక్క.. ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. మృతదేహం బాగా కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే మనిషి డెడ్‌బాడీ పక్కనే.. ఓ జింక కళేబరం ఉండటం సస్పెన్స్‌గా మారింది. ఘటనా స్థలంలో నాలుగు జతల చెప్పులు కూడా లభ్యమయ్యాయి.
ఆ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడా..? లేదా ఎవరైనా హత్య చేశారా..? లేదా వన్యమృగాలు దాడి చేసి చంపాయా అన్నది తెలియాల్సి ఉంది. పక్కనే జింక కళేబరం కూడా ఉండటంతో.. ఆ దిశగానూ పోలీసులు విచారిస్తున్నారు. ఆ నాలుగు జతల చెప్పులు కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, పోలీసులు సంయుక్తంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇక, మృతదేహం ఉన్న స్థితిని బట్టి వారం కంటే ముందే ఘటన జరిగినట్టు భావిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి