Andhra Pradesh: విద్యార్థి ఆత్మహత్య.. విషయం తెలిసి గుండెపోటుతో వార్డెన్‌‌ మృతి.. హాస్టల్‌లో ఏం జరిగింది..

|

Feb 05, 2023 | 8:08 AM

విద్యార్థి ఆత్మహత్య.. ఆ వెంటనే హాస్టల్‌ వార్డెన్‌ గుండెపోటుతో మృతి. గంటల వ్యవధిలో జరిగిన ఈ రెండు ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఇంతకీ.. ఆ హాస్టల్లో ఏం జరిగింది..?

Andhra Pradesh: విద్యార్థి ఆత్మహత్య.. విషయం తెలిసి గుండెపోటుతో వార్డెన్‌‌ మృతి.. హాస్టల్‌లో ఏం జరిగింది..
suicide
Follow us on

తిరుపతి జిల్లా గూడురు నారాయణ ఇంజినీరింగ్‌ కాలేజీలో విషాదం నెలకొంది. బీటెక్‌ సెకండియర్‌ చదివే ధరణేశ్వర్‌రెడ్డి అనే విద్యార్థి హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. ఏం జరిగిందో తెలసుకునే లోపే, అదే కాలేజీలోని హాస్టల్‌ వార్డెన్‌ శ్రీనివాసులు కూడా గుండెపోటుతో మృతి చెందారు. దాంతో విద్యార్థులు, కళాశాల సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. గూడురు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు తోటి విద్యార్థులను, కళాశాల సిబ్బందిని విచారించారు.

పులివెందులకు చెందిన ధరణేశ్వర్‌రెడ్డి ఉరివేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని పోలీసులు పలువురిని విచారించారు. ధరణేశ్వర్‌రెడ్డి బ్యాగులో కత్తి ఉన్నట్లు హాస్టల్‌ సిబ్బంది గుర్తించారు. అయితే, కత్తి బ్యాగులో ఎందుకు ఉందని ప్రశ్నించడంతో పాటు ధరణేశ్వర్‌రెడ్డి బ్యాగును స్టోర్‌ సిబ్బంది తీసుకెళ్లినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. అందుకే మనస్థాపంతో ఉరివేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు.

విద్యార్థి ధరణేశ్వర్‌రెడ్డి హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కి ఉరివేసుకున్న హాస్టల్‌ వార్డెన్‌ శ్రీనివాసులుకు తెలిసింది. దాంతో ఆయన కంగారుపడ్డట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీనివాసులకు ఛాతిలోనొప్పి వచ్చి , గుండెపోటు వచ్చి ఉంటుందని సమాచారం. ఏదిఏమైనా ఒకేరోజు హాస్టల్లో ఇద్దరు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..