Watch Video: తిరుపతిలో చిరుత కలకలం.. ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్‌లో సంచారం.. CCTVలో రికార్డైన దృశ్యాలు

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మరోసారి చిరుత కలకలం రేపింది. అర్ధరాత్రి వర్సిటీలోకి ఎంటరైన చిరుత క్యాంపస్‌ మొత్తం తిరిగింది.

Watch Video: తిరుపతిలో చిరుత కలకలం.. ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్‌లో సంచారం.. CCTVలో రికార్డైన దృశ్యాలు
Leopard found in SV University Campus, Tirupati

Updated on: Oct 15, 2021 | 1:11 PM

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మరోసారి చిరుత కలకలం రేపింది. అర్ధరాత్రి వర్సిటీలోకి ఎంటరైన చిరుత క్యాంపస్‌ మొత్తం తిరిగింది. వెటర్నరీ కాలేజీ ఉమెన్స్ హాస్టల్‌ దగ్గర ఎక్కువసేపు సంచరించింది. చెట్ల మధ్యన, రోడ్డుపైనా అటూఇటు తిరుగుతూ సీసీ కెమెరాలకు చిక్కింది. ఎస్వీ యూనివర్సిటీలో చిరుత సంచారంతో విద్యార్థులు హడలిపోతున్నారు. చాలా రోజులుగా యూనివర్సిటీ పరిసరాల్లో చిరుత తిరుగుతోందని అంటున్నారు. చీకటి పడ్డాక క్యాంపస్‌లోకి ప్రవేశిస్తోందని చెబుతున్నారు. చిరుత భయంతో రాత్రిపూట బయటికి రాలేకపోతున్నామని అంటున్నారు

ఎస్వీ యూనివర్సిటీ పరిసరాల్లో తిరుగుతోన్న చిరుతను పట్టుకోవాలని విద్యార్థులు, స్థానికులు కోరుతున్నారు. చిరుతను బంధించేందుకు వెంటనే ఉచ్చులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

సీసీటీవీలో రికార్డైన చిరుత సంచారం.. వీడియో చూడండి.

Also Read..

Maoist Leader RK Dies: మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతిని ధృవీకరించిన మావోయిస్టు పార్టీ..

Apple Side Effects: యాపిల్స్ ఎక్కువగా తింటున్నారా ?… అయితే జాగ్రత్త.. ప్రమాదం మీ చెంతనే..