
తిరుపతిలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి గుండె పోటుకుగురై హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న భక్తుడు శనివారం ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటక రాష్ట్రం మాలూరుకు చెందిన వేణుగోపాల్(45) అనే భక్తుడు శ్రీవారి దర్శనం కోసం ఈ నెల 17 తిరుపతికి ఒంటరిగా వచ్చాడు. ఇక శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూలైన్‌లో నిల్చున్నాడు. అతను నారాయణ గార్డెన్స్ వద్దకు రాగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించింది భక్తులు టీటీడీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. భక్తుల సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న టిటిడి సిబ్బంది.. వెణుగోపాల్‌ను అంబులెన్స్ సహాయంతో వెంటనే స్థానిక అశ్విని హాస్పిట్‌లకు తరలించారు.
అక్కడ వేణుగోపాల్‌ను పరీక్షించిన వైద్యులు అతని హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు నిర్ధారించారు. దీంలో అతనికి వెంటనే చికిత్సను అందించారు. అ తర్వాత మెరువైన చికిత్స కోసం అతన్ని స్విమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే గత రెండ్రోజులుగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వేణుగోపాల్ శనివారం ప్రాణాలు కోల్పోయాడు. దీంతో హాస్పిటల్ సిబ్బంది తిరుపతి టూటౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి. మృతుడి వివరాలను తెలుసుకున్నారు. దీంతో కర్ణాటక పోలీసుల సహాయంలో మృతదేహాన్ని వేణుగోపాల్ బంధువులకు అప్పగించే పనిలో ఉన్నారు తిరుపతి టూటౌన్ పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.