ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ కాలం సీఎంగా, నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత సొంతం చేసుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇవాళ 73వ ఏట అడుగుపెట్టారు. చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) పుట్టినరోజు వేడుకలను కార్యకర్తలు, ఆయన అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు విషెస్ తెలుపుతూ ప్లెక్సీలు, బ్యానర్లు కట్టి అభిమానాన్ని చాటుకుంటున్నారు. మరికొంత మంది అన్నదానం, రక్తదానం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా (Social Media) వేదికగా పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే ఆయన అభిమానులు చంద్రబాబు ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా తిరుమల(Tirumala)లో ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అఖిలాండం వద్ద 720 కొబ్బరికాయలు కొట్టి అభిమానాన్ని చాటుకున్నారు. కర్పూరం వెలిగించి, తమ అభిమాన నేత ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు రాష్ట్ర టీడీపీ మీడియా కో- ఆర్డినేటర్ శ్రీధర్ వర్మ వెల్లడించారు.
Also Read
Anakapalle: పుష్ప.. కత్తి పట్టక ముందు.. కాబోయే వరుడితో సెల్ఫీ.. ఫొటో వైరల్