
సాఫ్ట్ వేర్ ఉద్యోగి నాగరాజు మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మర్డర్ కు ముందు రోజు నిందితుడు రిపుంజయ, మృతుడు నాగరాజు, తమ్ముడు పురుషోత్తం మధ్య జరిగిన కాన్ఫరెన్స్ కాల్ ఆడియో లీక్ అయింది. నా భార్యతోనే మీ తమ్ముడు పురుషోత్తం లైంగిక సంబంధం పెట్టుకుంటాడా .. అని నాగరాజుకు వార్నింగ్ ఇచ్చాడు రిపుంజయ. వాడ్ని వదిలేదే లేదు మీ అంతుచూస్తాఅంటూ వార్నింగ్ ఇచ్చాడు రిపుంజయ. విషయం చెపితే నా తమ్ముడు పురుషోత్తంతో క్షమాపణలు చెప్పిస్తానని నాగరాజు చెప్పాడు.
డబ్బు సంపాదిస్తే గర్వంవస్తుందా.. అంటూ నాగరాజు కుటుంబ సభ్యులను అసభ్యపదజాలంతో దూషిండంతో కొంతసేపటికి రిపుంజయపై తిరగబడ్డ నాగరాజు. నేను తిరుపతిలో ఉన్నా నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు వస్తానంటూ రిపుంజయకు వార్నింగ్ ఇచ్చాడు నాగరాజు. ఇదే క్రమంలో ముందు తనదగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని రిపుంజయను నాగరాజు గట్టిగా అడిగాడు.
రిపుంజయతో మాట్లాడిన తర్వాత.. నాగరాజు అతని తమ్ముడ్ని హెచ్చరించాడు. అసలు ఏం తప్పు చేశావో చెప్పు అంటూ తమ్ముడు పురుషోత్తంను నిలదీశాడు నాగరాజు. చివరకు లైంగిక సంబంధం, నగదు లావాదేవీల కారణంగా తమ్ముడు పురుసోత్తం కోసం అతడు అన్న నాగరాజు బలైనట్లు ఆడియోలో స్పష్టంగా తెలుస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..