Tirumala Tirupati Temple: తిరుమలేశుడికి రికార్డు స్థాయిలో కానుకలు.. నేడు ఒక్కరోజు శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే..

|

Dec 26, 2020 | 5:30 AM

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల తిరుపతి వేవస్థానాకి భక్తులు పోటెత్తారు. దాంతో నేడు రికార్డు స్థాయిలో శ్రీవారికి హుండీ ఆదాయం

Tirumala Tirupati Temple: తిరుమలేశుడికి రికార్డు స్థాయిలో కానుకలు.. నేడు ఒక్కరోజు శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే..
Follow us on

Tirumala Tirupati Temple: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల తిరుపతి వేవస్థానాకి భక్తులు పోటెత్తారు. దాంతో నేడు రికార్డు స్థాయిలో శ్రీవారికి హుండీ ఆదాయం వచ్చింది. లాక్ డౌన్ తరువాత స్వామి వారికి తొలిసారి అత్యధికంగా హుండీ ఆదాయం వచ్చింది. ఇవాళ ఒక్కరోజు శ్రీవారికి రూ. 4.3 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. కాగా, ఈ నెల మొత్తంగా చూసుకున్నట్లయితే.. ఐదు సార్లు రూ. 3 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు అంతకు మించి ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కాగా, లాక్‌డౌన్ అనంతరం తొలిసారి నేడు రికార్డు స్థాయిలో భక్తులు తిరుమలేశుడిని దర్శించుకుంటున్నారు. ఇప్పటి వరకు 50 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక జనవరి 3వ తేదీ వరకు వైకుంఠ ద్వారం తెరి ఉండనుంది. దాంతో మరింత సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం కనిపిస్తోంది.

 

Also read:

సరికొత్త రికార్డు సృష్టించిన‌ ఫాస్టాగ్… ఒక్క రోజులోనే రూ.80 కోట్లు వసూళ్లు.

Telangana: ఆపద్బాంధవుడిగా మారిన అంబులెన్స్.. వాహనంలోనే పండంటి ఆడబిడ్డకు జన్మచ్చిన తల్లి..!