Telangana: ఆపద్బాంధవుడిగా మారిన అంబులెన్స్.. వాహనంలోనే పండంటి ఆడబిడ్డకు జన్మచ్చిన తల్లి..!

Delivery In Ambulance: పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీ స్త్రీకి 108 సిబ్బంది అండగా నిలిచింది. అంబులెన్స్‌లోనే ఆ తల్లి పండంటి...

Telangana: ఆపద్బాంధవుడిగా మారిన అంబులెన్స్.. వాహనంలోనే పండంటి ఆడబిడ్డకు జన్మచ్చిన తల్లి..!
Follow us

|

Updated on: Dec 25, 2020 | 9:19 PM

Delivery In Ambulance: పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీ స్త్రీకి 108 సిబ్బంది అండగా నిలిచింది. అంబులెన్స్‌లోనే ఆ తల్లి పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన పానం సుమలత అనే గర్భిణీ స్త్రీ పురిటినొప్పులతో బాధపడుతూ లక్ష్మీపూర్ గ్రామం నుండి 108 సహాయం ద్వారా కోటపల్లి ప్రాథమిక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మద్యలో తీవ్రమైన పురిటి నొప్పులు రావడంతో 108 వాహనాన్ని మార్గంమధ్యలో ఆపి 108 సిబ్బంది చరవాణి సహాయంతో హైదరాబాద్ కాల్ సెంటర్‌లోని డాక్టర్ల సూచన మేరకు చికిత్స అందించడంతో సుఖప్రసవం జరిగింది.

ఆ గర్భిణీ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది..మెరుగైన వైద్యం కోసం కోటపల్లి ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. తల్లి, పాప క్షేమంగా ఉన్నట్లు108 సిబ్బంది పేర్కొన్నారు. సరైన సమయంలో 108 సిబ్బంది చేసిన సేవలు మరువలేనివని వారి కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Also Read:

Bigg Boss 4: మెహబూబ్ సైగలపై స్పందించిన అభిజిత్.. ‘స్టార్ మా’ తేల్చాలంటూ ఆసక్తికర కామెంట్స్.!

కేంద్రం కీలక నిర్ణయం.. జనవరి 1 నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్ తప్పనిసరి.!

ఏపీ మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం దుకాణాలు, బార్లపై నిషేధం లేదంటూ..!

షాకింగ్ న్యూస్: కరోనా లక్షణాలు లేవని ఆఫీస్‌కు వచ్చిన ఉద్యోగి.. ఏడుగురు మృతి, 300 మంది క్వారంటైన్.!