Andhra News: ఈ ముగ్గురితో జాగ్రతా.. ఆదమరిచారో అంతే సంగతులు!

ఏపీలో కొందరు మహిళలు కొత్త రకం మోసానికి తెరలేపారు. షాప్‌లో నగలు కొనడానికి వచ్చిన ముగ్గురు మహిళలు నిజమైన బంగారు ఆభరణాలను కొట్టేసి వాటి స్థానంలో నకిలీ ఆభరణాలను ఉంచి వెళ్లారు. వాళ్లు వెళ్లిన కాసేపటికి అనుమానం వచ్చిన షాప్‌ యజమాని వాటిని పరిశీలించగా అవి నకిలీవని గుర్తించారు. దీంతో ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Andhra News: ఈ ముగ్గురితో జాగ్రతా.. ఆదమరిచారో అంతే సంగతులు!

Edited By:

Updated on: May 22, 2025 | 4:21 PM

నర్సరావుపేటలోని ఉన్న శారదా జ్యూయలర్స్ లోకి ముగ్గురు మహిళలు వచ్చారు. బంగారు కమ్మలు కావాలంటూ అడిగారు. దీంతో షాపులోని పనిచేసే సేల్స్ గర్ల్స్ ఆ మహిళలకు కమ్మలు చూపించింది. దాదాపు అరగంటపాటు షాపులోనే ఉన్న మహిళలు ముగ్గురు వివిధ మోడల్స్ చూసి నచ్చలేదని చెప్పి షాప్‌ నుండి వెళ్లిపోయారు. అయితే వారు వెళ్లి పోయిన తర్వాత జరిగిన మోసాన్ని షాపు నిర్వహాకులు గుర్తించారు.

వచ్చిన ముగ్గురికి బంగారు కమ్మలతో పాటు, బుట్టలను కూడా చూపించమని అడిగారు. దీంతో సెల్స్‌ గర్ల్స్‌ షాప్‌లో ఉన్న చాలా మోడల్స్‌ను వాళ్లకు చూయించింది. దీంతో ఆ ముగ్గురు మహిళలు సేల్స్ గర్ల్స్ కళ్లుగప్పి తమ వెంట తెచ్చుకున్న వన్ గ్రామ్ గోల్డ్ కమ్మలు, బుట్టలను ట్రేలో పెట్టి.. నిజమైన బంగారంతో చేసిన కమ్మలు, బుట్టలు తీసుకున్నారు. ఈ విషయం గమనించని సేల్స్ గర్ల్స్ ట్రేలో అన్ని ఆభరణాలు ఉండటాన్ని చూసి చెక్ ట్రేను తీసి లోపల పెట్టేసింది. ఇక వాళ్లు అక్కడి నుంచి వెళ్లి పోయాక.. యజమానికి ఎందుకో అనుమానం రావడంతో.. ట్రేలోని ఆభరణాలను పరిశీలించగా అవి వన్ గ్రామ్ గోల్డ్ తో చేసిన నాన్ కేడిఎం బుట్టలుగా గుర్తించాడు. దీంతో వచ్చిన మహిళలు బంగారు ఆభరణాలు తీసుకెళ్లి వాటి స్తానంలో నకిలీ బంగారు ఆభరణాలు ఉంచినట్లు గ్రహించాడు. వెంటనే సీసీ కెమెరా విజువల్స్‌ను పరిశీలించారు. దీంతో అసలు విషయం బయటపడింది.

వీడియో చూడండి…

ఇక షాపు నుండి బయటకు వచ్చిన మహిళలు ఆటో ఎక్కి వెళ్లినట్టు తెలుసుకున్న యజమాని స్థానికంగా ఉన్న సీసీ కెమెరా విజువల్స్ ద్వారా ఆటో నంబర్ తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అయితే వాళ్లు వెళ్లిన ఆటోకు నంబర్ ప్లేట్ లేదు. దీంతో మోసం చేసే ఉద్దేశంతోనే ముగ్గురు మహిళలు వచ్చి అసలు బంగారు ఆభరణాల స్థానంలో నకిలివి ఉంచినట్లు అర్ధమైంది. దీంతో అప్రమత్తమైన యజమాని ఈ విజువల్స్‌ను అన్ని షాపులకు పంపించి. వారిని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..