Crime news:పండుగ పూట విషాదం.. డ్యాంలో మునిగి ముగ్గురు దుర్మరణం.. మృతుల్లో తండ్రీకుమార్తెలు

|

Apr 10, 2022 | 5:47 PM

శ్రీ సత్యసాయి జిల్లాలో శ్రీరామనవమి(Sri Ramanavami) పండుగ రోజు తీవ్ర విషాదం నెలకొంది. రామగిరి మండలంలోని పేరూరు డ్యాం(Peruru Dam)లో మునిగి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. చేపల కోసం డ్యాంలో దిగి....

Crime news:పండుగ పూట విషాదం.. డ్యాంలో మునిగి ముగ్గురు దుర్మరణం.. మృతుల్లో తండ్రీకుమార్తెలు
Swimming Death
Follow us on

శ్రీ సత్యసాయి జిల్లాలో శ్రీరామనవమి(Sri Ramanavami) పండుగ రోజు తీవ్ర విషాదం నెలకొంది. రామగిరి మండలంలోని పేరూరు డ్యాం(Peruru Dam)లో మునిగి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. చేపల కోసం డ్యాంలో దిగి, ప్రమాదవశాత్తు మునిగి ముగ్గురూ మృత్యువాత పడ్డారు. మృతులను ఎగువపల్లి గ్రామం కొత్తగెరికి చెందిన నాగరాజు, అతని కూతురు రక్షిత, సోదరుడు రామాంజి గా పోలీసులు గుర్తించారు. వారి మృతదేహాల కోసం స్థానికులు గాలిస్తున్నారు. తండ్రీ, కూతురి మృతదేహాలు నీటిపై తేలగా.. రామాంజీ కోసం గాలిస్తున్నారు. వీరు కర్ణాటక రాష్ట్రంలోని పావగడ తాలూకా నాగలమడక నుంచి ఎగువపల్లికి వచ్చారు. పండగ సందర్బంగా ఎగువపల్లికి రాగా.. ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా విషాదం నింపింది.

Also Read

Ration Card: రేషన్‌కార్డు దారులకి శుభవార్త.. త్వరలో ఆ పనులు కూడా అక్కడే..!

RRR Box Office Collection: తొక్కుకుంటూ పోతున్న ఆర్ఆర్ఆర్.. 1000 కోట్లమార్క్‌‌ను క్రాస్ చేసిన జక్కన్న మూవీ

Viral: వ్యక్తి చనిపోయాడని కన్ఫామ్ చేసిన డాక్టర్లు.. అంత్యక్రియలకు ముందు స్నానం చేయిస్తుండగా షాక్!