Family Suicide: పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం.. ఏడాదిన్నర బాలుడు సహా దంపతులు బలవన్మరణం

|

Jan 12, 2021 | 3:04 PM

పశ్చిమ గోదావరి జిల్లా  పాలకోడేరు మండలం కుముదవల్లి శివారులో విషాదం చోటుచేసుకుంది. పురుగులమందు తాగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Family Suicide: పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం.. ఏడాదిన్నర బాలుడు సహా దంపతులు బలవన్మరణం
Follow us on

Family Suicide: పశ్చిమ గోదావరి జిల్లా  పాలకోడేరు మండలం కుముదవల్లి శివారులో విషాదం చోటుచేసుకుంది. పురుగులమందు తాగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏడాదిన్నర బాలుడు సహా దంపతులు తనువు చాలించారు. మృతులు పరశురాం, సత్యవతి, ఏడాదిన్నర బాలుడుగా గుర్తించారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని బంధువులు చెబుతున్నారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హైమావతి మహిళకు మృతులు రూ.46 లక్షలు ఇచ్చినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు బంధువులు. ఆమె డబ్బుతో పారిపోవడంతో ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డారని చెబుతున్నారు. విచారణలో అసలు విషయాలు తెలియనున్నాయి.

Also Read:

CM Jagan Meets Dattatreya: దుర్గమ్మ సేవలో దత్తాత్రేయ.. మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం జగన్..

Covid Vaccine: ఏపీకి చేరుకున్న కొవిడ్ వ్యాక్సిన్.. తొలి విడతగా 4.96 లక్షల కరోనా టీకాల పంపిణీ..