పోలీసులకే సవాల్ విసురుతున్న దొంగలు.. ఏకంగా నగరం నడిరోడ్డులో హల్‌చల్..!

కాకినాడ జిల్లాలో ముఖ్య కూడలిలోనే దొంగలు రెచ్చిపోయారు. కత్తిపూడిలో పరిసర ప్రాంతాల్లో నిత్యం చోరీలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం (డిసెంబర్ 29) తెల్లవారుజామున దొంగల ముఠా హల్‌చల్ చేసింది. రెండుచోట్ల చోరీలకు పాల్పడగా మరో మూడుచోట్ల చోరీకి విఫలయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ బృందాలతో గాలింపు చేపట్టారు.

పోలీసులకే సవాల్ విసురుతున్న దొంగలు.. ఏకంగా నగరం నడిరోడ్డులో హల్‌చల్..!
Major Robbery , Kathipudi

Edited By:

Updated on: Dec 30, 2025 | 1:21 PM

కాకినాడ జిల్లాలో ముఖ్య కూడలిలోనే దొంగలు రెచ్చిపోయారు. కత్తిపూడిలో పరిసర ప్రాంతాల్లో నిత్యం చోరీలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం (డిసెంబర్ 29) తెల్లవారుజామున దొంగల ముఠా హల్‌చల్ చేసింది. రెండుచోట్ల చోరీలకు పాల్పడగా మరో మూడుచోట్ల చోరీకి విఫలయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ బృందాలతో గాలింపు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం.. కత్తిపూడి 16వ జాతీయ రహదారి సర్వీసు రోడ్డును ఆనుకుని ఉన్న సామ్ సంగ్ మొబైల్ షోరూమ్‌లో దొంగలు పడ్డారు. ఈ ఘటనలో 30 వేల రూపాయల నగదు, రూ.2 లక్షలకు పైగా విలువ చేసే 12 సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లారు. వీటితోపాటు నెల్లిపూడి శ్రీనుకు చెందిన బైకును అపహరించుకుని పోయారు. అలాగే, తులసీ విత్తనాల షాపు, రహదారికి ఆనుకుని ఉన్న పొలాల్లో విద్యుత్ మోటార్లు చోరీ చేసేందుకు విఫలయత్నం చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. ఆధారాలను సేకరించినట్టు అన్నవరం ఎస్ఐ తెలిపారు. ముఖ్య కూడలి కావడంతో మరింత గస్తీని పెంచాలని ప్రజలు కోరుతున్నారు. తెల్లవారుజాము వాహనాలు తిరుగుతున్న సమయంలోనే దర్జాగా ముఖాలకు మాస్కులు ధరించి దోపిడీ చేసిన దొంగల తీరుపై స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..