Andhra Pradesh: వాలంటీర్స్‌కు అలెర్ట్… రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు.. అలా చేస్తే అంతే

|

Sep 16, 2022 | 5:58 PM

ఎన్నికల విధుల్లో వాలంటీర్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించవద్దని రాష్ట్ర ఎలక్షన్ కమిషన్.. ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Andhra Pradesh: వాలంటీర్స్‌కు అలెర్ట్... రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు.. అలా చేస్తే అంతే
Ap Volunteers
Follow us on

AP Volunteers: ఏపీ పాలనా వ్యవస్థలో వాలంటీర్లు కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికల కమిషన్.. ఏపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది.  వాలంటీర్‌లు ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చూడాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం చేసే ప్రక్రియలో వాలంటీర్లను భాగస్వాములు చేయొద్దని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికలకు సంబధించిన ఏ ప్రక్రియలోనూ వారికి విధులు అప్పగించవద్దని కలెక్టర్లకు ఎన్నికల కమిషన్ సూచించింది. గతంలో కూడా ఇదే తరహా ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల కమిషన్..

రాష్ట్ర ఎన్నికల సంఘం నియమాల ప్రకారం…

  • గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లను ఎలక్షన్స్‌కు సంబంధించిన అన్ని రకాల విధుల నుంచి దూరంగా ఉండాలి
  •  ఏ అభ్యర్థి తరఫున కూడా వాలంటీర్స్ పోలింగ్‌ ఏజెంట్లుగా ఉండకూడదు
  •  ఓటరు స్లిప్పుల పంపిణీ, పోలింగ్‌ ఏర్పాట్లు, పోలింగ్‌ విధులు,  ఓటర్ల నమోదు, తొలగింపు, చేర్పులు, మార్పులు, ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్‌ కేంద్రాల ఎంపిక, ఓట్ల లెక్కింపు వంటి పనుల్లో వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనకూడదు
  • రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులు వాలంటీర్లకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విధులూ అప్పగించరాదు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..