AP New Court: ఆంధ్రప్రదేశ్‌లో నూతన కోర్టు త్వరలోనే ప్రారంభం కాబోతోంది. విజయవాడలో అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న కోర్టు సముదాయాల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణతో సీఎం జగన్, ఏపీ హైకోర్ట్ చీఫ్ జస్టిస్.. చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుంది. నూతన భవనంలో ఇప్పటికే 6 అంతస్తులు పూర్తయ్యాయి. మిగతా ప్లోర్లు కూడా త్వరలో పూర్తవుతాయని చెప్పారు. కొత్త కోర్టు భవనాలను 100 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తోంది ప్రభుత్వం. నూతన భవనంలో మొత్తం 29 కోర్టులు ఏర్పాటవుతాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా, జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు పరిశీలించారు. కాగా, రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో నూతన హైకోర్ట్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. గత ప్రభుత్వం తాత్కాలిక భవనం నిర్మించింది. అందులోనే ఇప్పటి వరకూ కార్యకలాపాలు సాగాయి. ఇక నుంచి కొత్త బిల్డింగ్ నుంచి పనులు చేపట్టనుంచి ఏపీ హైకోర్ట్. అత్యాధునిక సాంకేతికత, హంగులతో కొత్త బిల్డింగ్ రూపుదిద్దుకుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..