
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. ఏపీలో ఇప్పటికే చాలా ఎయిర్‌పోర్టులు అందుబాటలో ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప, కర్నూలు, రాజమండ్రి వంటి జిల్లాల్లో ఎయిర్‌పోర్టులు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. త్వరలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్ ఏపీ ప్రజలకు అందుబాటులోకి రానుంది. దీని వల్ల ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రజలకు భారీ లబ్ది చేకూరనుంది. ప్రయాణ సౌకర్యంతో పాటు ఎయిర్‌పోర్ట్ వల్ల రవాణా సౌకర్యాలు పెరగడం వల్ల కొత్త కంపెనీలు రానున్నాయి. దీంతో హోటళ్లు, లాజిస్ట్రిక్ వ్యాపారం పెరిగి స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే ఈ ఎయిర్‌పోర్ట్ పనులు పూర్తవ్వగా.. ఏప్రిల్‌లో ప్రారంభించనున్నారు. ఇప్పటికే ట్రయల్ రన్స్ పూర్తయ్యాయి.
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే దానిపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు క్లారిటీ ఇచ్చారు. జూన్ 26న భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. జనవరి 1వ తేదీన ట్రయల్ రన్ కింద తొలి విమానం ల్యాండ్ అయినట్లు తెలిపారు. ఈ ట్రయల్ రన్‌లో భాగంగా ఢిల్లీ నుంచి ఇండిగో విమానం భోగాపురంకు చేరుకుంది. ఈ విమానంలో రామ్మోహన్ నాయుడితో పాటు ఎంపీలు, విమానయాన సంస్ధ ఉన్నతాధికారులు ప్రయాణించారు. ఈ ఎయిర్‌పోర్ట్ పనులు దాదాపు అన్నీ పూర్తయ్యాయని, ప్రారంభించేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయని తాజాగా రాహ్మోహన్ నాయుడు అన్నారు. అటు భారత్‌లో విమానాల తయారీకి బ్రెజిల్ విమాన తయారీ సంస్థ ఎంబ్రాయర్ సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ఏపీ, గుజరాత్‌లో తయారీ యూనిట్లను ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలో భోగాపురంలో చేత యూనిట్‌ను ఎంబ్రాయ్ సంస్థ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. భూమి కేటాయించడంతో పాటు మౌలిక సదుపాయాల కోసం వసతులు కల్పిస్తామని ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది.
ఎంబ్రాయర్ సంస్థ చిన్న, మధ్యస్థ, సైనిక, ట్రాన్స్‌పోర్ట్ విమానాలను తయారు చేయనుంది. దీంతో భోగాపురంలో మెయింటనెన్స్ రిపేర్ అండ్ ఓవర్ హల్, ఏరోస్సేస్ కస్టర్లు ఏర్పాటు చేసేలా ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. భోగాపురంలో ఇది ఏర్పాటు చేస్తే మరింత ప్రయోజనం జరగనుంది. భారత్‌లో ఎంబ్రాయర్ సంస్థ విమాన తయారీ యూనిట్లను ఏర్పాటు చేయనుండంపై రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. భారత్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం శుభపరిణామమని తెలిపారు. భారత్ విమానయాన రంగంలో ఇదొక కీలక మైలురాయిగా పేర్కొన్నారు.