Tenth Exams: నేటి నుంచే “పది” పరీక్షలు.. రెండేళ్ల తర్వాత ఆ విధానంలో ఎగ్జామ్స్

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు(Tenth Class Exams) ప్రారంభం కానున్నాయి. ఫీజలు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తామని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నారన్న ఫిర్యాదులతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు...

Tenth Exams: నేటి నుంచే పది పరీక్షలు.. రెండేళ్ల తర్వాత ఆ విధానంలో ఎగ్జామ్స్
10 th Exams in AP

Updated on: Apr 27, 2022 | 7:14 AM

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు(Tenth Class Exams) ప్రారంభం కానున్నాయి. ఫీజలు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తామని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నారన్న ఫిర్యాదులతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నేరుగా వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు(Hall Tickets) డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానందరెడ్డి తెలిపారు. హాల్‌ టికెట్లపై ప్రధానోపాధ్యాయుడి సంతకం లేకపోయినా అనుమతించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సరైన కారణాలతో అరగంట ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి వచ్చినా అనుమతిస్తామన్నారు. ఈ ఏడాది 6,22,537మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 3,776 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి.

రెండేళ్ల తర్వాత మొదటిసారిగా పదో తరగతి పరీక్షలు ఏడు పేపర్లతో జరుగుతున్నాయి. పదో తరగతి పరీక్షల కారణంగా ఎగ్జామ్ సెంటర్స్ నిర్వహిస్తున్న స్కూళ్లల్లో పని వేళలు మార్పు చేశారు. 6-9 తరగతులకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి 4.45 గంటల వరకు సమ్మేటివ్ – 2 పరీక్ష ఉంటుంది.

Also Read

Rashmika Mandanna: అందుకే జెర్సీ సినిమాకు నో చెప్పాను.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

Popcorn: పాప్‌కార్న్‌ తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి.. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు..