విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వద్ద మళ్లీ టెన్షన్.. టెన్షన్

| Edited By: Pardhasaradhi Peri

May 11, 2020 | 4:00 PM

విశాఖ ఆర్ ఆర్ వెంకటాపురం అజంతా కాలనీ వద్ద మరోసారి ఉధృతి చోటుచేసుకుంది. గ్యాస్ లీక్ ప్రమాద గ్రామాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రులు వస్తున్నారనే సమాచారంతో భారీగా రోడ్ల మీదకు వచ్చారు స్థానికులు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని..

విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వద్ద మళ్లీ టెన్షన్.. టెన్షన్
Follow us on

విశాఖ ఆర్ ఆర్ వెంకటాపురం అజంతా కాలనీ వద్ద మరోసారి తీవ్ర ఉధృతి చోటుచేసుకుంది. గ్యాస్ లీక్ ప్రమాద గ్రామాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రులు వస్తున్నారనే సమాచారంతో భారీగా రోడ్ల మీదకు వచ్చారు స్థానికులు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో.. పోలీసులు, స్థానికుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక మళ్లీ అక్కడ తోపులాట చోటుచేసుకుంది. దాంతో పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. మాకు వెంటనే న్యాయం చేయాలని, ఎల్జీ పాలిమర్స్ కంపెనీ మూసేయాలని అక్కడి వారు ఆందోళన చేశారు. దీంతో మంత్రులు కార్లు దిగి వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినా కూడా అక్కడి ప్రజలు వినకపోవడంతో.. పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు.

Read More:

దిల్‌రాజు పెళ్లి ఫొటోలు.. మాతృదినోత్సవం రోజు కొత్త జీవితం

గూగుల్ డ్యుయోలో గ్రూప్ వీడియో కాలింగ్.. ఒకేసారి 12 మందితో!