శివుడు కైలాస నాధుడు… మంచు కొండల్లో సతి పార్వతి సమేతంగా నివసిస్తూ..లోకాన్ని పాలిస్తాడు.. శివుడు అభిషేక ప్రియుడు.. భక్తితో చెంబుడు నీళ్లతో అభిషేకిస్తే సంతోషిస్తాడు. భక్తి శ్రద్ధలతో పూజిస్తే కుటుంబ ఆర్థిక సమస్యలను తొలగించే ఈశ్వరుడు. మారేడు ఆకులతో పూజిస్తే.. కోరిన కోరికలు తీర్చే శంభునాధుడు. అభిషేక ప్రియుడు మాత్రమే కాదు.. శివుడికి ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా పెట్టి మనస్పూర్తిగా వేడుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మరీ అలాంటి శివయ్యకు అసలు ఏ నైవేద్యం ఇష్టమో తెలుసా ?.. భక్త కన్నప్ప మాంసం పెట్టి తిను శివయ్య అని ప్రాధేయపడ్డాడు.
పాలతో అభిషేకం చేయటం, పాయసం, చక్ర పొంగలి, పూర్ణాలతో నైవేధ్యం పెట్టడం ఎవరి స్థోమతకు తగ్గ విధంగా వాళ్లు చేస్తారు. కానీ పాలకొల్లులోని పంచారామ క్షేత్రం క్షీరారామ లింగేశ్వరుడికి ఒక భక్తుడు ఏకంగా ఐస్ క్రీంని నైవేధ్యంగా సమర్పించాడు. పాలకొల్లుకు చెందిన దేవెళ్ల నరసింహమూర్తి ఈ విచిత్ర నైవేధ్యాన్ని స్వామివారికి సమర్పించాడు. దాదాపు పది కే.జీ ల ఐస్ క్రీంను సమర్పించటం ఇపుడు చర్చ నీయాంశంగా మారింది. ఈ విషయం తెలిసి ముందుగా అక్కడి భక్తులు అవాక్కయ్యారు.. అనంతరం చల్ల చల్లని ఐస్ క్రీమ్ ప్రసాదంగా తీసుకోవడానికి భారీగా తరలివస్తున్నారు.
Also Read: Gamanam Movie: అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు.. కానీ.. ఆసక్తికర కామెంట్స్ చేసిన గమనం హీరో..
Upasana & Samantha: ఎంతో విలువైనది..వెలకట్టలేని ఎమోషన్స్ ఉంటాయంటూ ఉపాసన ఎమోషనల్.. సమంత రియాక్షన్..
Shyam Singha Roy: సిరివెన్నెల రాసిన చివరి పాట.. శ్యామ్ సింగరాయ్ నుంచి మరో సాంగ్ రిలీజ్.. ఎప్పుడంటే..