AP – Telangana: తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతోన్న పాములు.. యాడ పడితే ఆడ

|

Mar 17, 2025 | 3:33 PM

ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తోంది. ఎండలు మండిపోతున్నాయి. దీంతో వేసవి తాపానికి... నీటి కోసం వన్యప్రాణులు.. పాములు జనావాసాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రల్లో పాములు హల్‌చల్ చేస్తోన్న ఘటనలు పెరిగాయి. అప్రమత్తతం అవసరం. మీకు ఏవైనా జీవులు తారసపడితే అటవీ శాఖకు సమాచారం ఇవ్వండి...

AP - Telangana: తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతోన్న పాములు.. యాడ పడితే ఆడ
Snake
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో పాములు హల్‌చల్ చేస్తున్నాయ్. ఒకచోట ఇంట్లో దూరితే.. మరోచోట కారు, బైక్స్‌లో దూరి ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేశాయి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఓ వ్యక్తి టూవీలర్‌లో నాగుపాము దూరింది. బైక్ ముందుభాగంలోని డూమ్‌లో పాము బుసలు కొట్టడం చూసి.. చాలాసేపు శ్రమించి బయటకు తీశారు.

విశాఖ పెందుర్తిలో ఇంటి టాయిలెట్‌లో నాగుపాము దూరింది. బాత్‌రూమ్‌ కమోడ్‌లో నక్కిన పామును చూసి.. భయంతో పరుగులు తీశారు కుటుంబ సభ్యులు. నాగుపామును స్నేక్ క్యాచర్ పట్టుకుని తీసుకెళ్లాడు.

నెల్లూరు జిల్లా దామరమడుగు గ్రామంలో చేపల వలకు భారీ కొండచిలువ చిక్కింది. వేగూరు కాలువలో గిరిజన మత్స్యకారులు చేపల కోసం వల వేయగా.. కొండ చిలువ చిక్కడంతో అటవీ అధికారులకు అప్పగించారు.

విశాఖలో సరదాగా బీచ్‌కు వెళ్లిన కుర్రాళ్లకు కొండ చిలువ రిటన్ గిఫ్ట్‌గా వచ్చింది. ఇన్నోవా కారు పార్క్ చేసి బీచ్‌లో ఎంజాయ్ చేశాక.. తిరిగి వెళ్దామనే సమయంలో కారు టైర్ దగ్గర కొండ చిలువ ఉండటం గమనించారు. స్నేక్ క్యాచర్.. అర్థరాత్రి.. కొండచిలువను పట్టుకున్నాడు.

వేసవికాలం భూమిలో కూడా సెగ పెరుగుతంది. దీంతో కన్నాలు, పుట్టల్లో ఉండే పాములు ఆ వేడి తట్టుకోలేక బయటకు వస్తాయి. దీంతో బరబరా పాక్కుంటూ కాస్త చల్లదనం ఉన్న ప్రాంతాలకు వస్తాయి. దీంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

పాముల హల్‌చల్ వీడియో దిగువన చూడండి…