ఆ ప్రాజెక్టు అత్యంత కీలకం.. తెలంగాణ నాయకులు అర్ధం చేసుకోవాలి: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

పోలవరం -బనకచర్ల ప్రాజెక్టు అత్యంత కీలకం.. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కరువు అనే సమస్య ఉండదు.. తెలంగాణ నాయకులు కూడా అర్ధం చేసుకోవాలి.. అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రెండు తెలుగురాష్ట్రాలకు నదుల అనుసంధానం అవసరం అంటూ పేర్కొన్నారు.

ఆ ప్రాజెక్టు అత్యంత కీలకం.. తెలంగాణ నాయకులు అర్ధం చేసుకోవాలి: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Chandrababu Naidu

Updated on: Aug 30, 2025 | 4:25 PM

పోలవరం -బనకచర్ల ప్రాజెక్టు అత్యంత కీలకం.. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కరువు అనే సమస్య ఉండదు.. తెలంగాణ నాయకులు కూడా అర్ధం చేసుకోవాలి.. అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రెండు తెలుగురాష్ట్రాలకు నదుల అనుసంధానం అవసరం అంటూ పేర్కొన్నారు. మంచి పనులు చేస్తుంటే కొందరు అడ్డుకుంటున్నారు.. విషవృక్షంలా కొందరు మారి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు తరలించారు. ఈ సందర్భంగా అక్కడ జలహారతి నిర్వహించారు చంద్రబాబు నాయుడు.. అనంతరం జరిగిన బహిరంగసభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో రప్పా రప్పా రాజకీయం చేయాలనుకున్నారు.. కానీ పులివెందుల, ఒంటిమిట్టలో ఏం జరిగింది.. అంటూ చంద్రబాబు వివరించారు.

కుప్పం నియోజకవర్గానికి భారీగా పెట్టుబడులు తీసుకొస్తున్నాం.. అంటూ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో సినిమా సెట్టింగ్‌ వేసి మోసం చేసిన చరిత్ర వైసీపీది.. నీటి విలువ తెలిసిన పార్టీ తెలుగుదేశం అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ, ఇప్పుడు రాళ్ల సీమగా మారిందన్నారు. డిసెంబర్‌లో కుప్పంలో ఎయిర్‌పోర్టు ప్రారంభిస్తామని.. చంద్రబాబు పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..