AP – Telangana: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్

|

Jun 07, 2023 | 5:34 PM

ఇక ఎండల తీవ్రత తగ్గినట్లే అనుకోవాలి. మరో 48 గంటల్లో రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. అంతకుముందే ఉరుములు, మెరుపులతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రాలు తెలిపాయి.

AP - Telangana: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
Andhra - Telangana Weather Report
Follow us on

వచ్చే 48 గంటలలో  కేరళలో రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని భాతర వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు దక్షిణాదిలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి కూడా పరిస్థితులు అనువుగా ఉన్నాయని వెలల్డించింది. అరేబియా సముద్రం, మొత్తం లక్షద్వీప్ ప్రాంతం, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతం, మరిన్ని భాగాలు నైరుతి & మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు ఈ సమయంలో అనుకూలంగా ఉన్నాయి. దక్షిణ ఛత్తీస్‌గఢ్ & పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీన పడినది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణం లో పశ్చిమ/ నైరుతి గాలులు వీస్తున్నాయి.

వీటి ప్రభావంతో  ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో  తేలిక పాటి నుండి ఒక మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.

తెలంగాణలో రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం బుధవారం బలహీనపడిందని వివరించింది. అయితే పలు ప్రాంతాల్లో వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని పేర్కొంది. దీనిని బట్టి తెలంగాణలో మిశ్రమ వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం