
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గి.. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కేవలం తెల్లవారు జాము వేళల్లో మాత్రమే చలి ఉంటుంది.. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం, ఉష్ణోగ్రతలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. వాయువ్య – ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని.. తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురిసే అవకాశముందని పేర్కొంది. అంతేకాకుండా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, యానములో దిగువ ట్రోపో ఆవరణములో వాయువ్య, ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఆదివారం, సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
మంగళవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
ఆదివారం, సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
మంగళవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
గమనిక:- రాగల 2 రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో గరిస్ట ఉష్ణోగ్రతలు సాధారణముకంటే 2-3 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగాను, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణముకంటే 2-4 డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశముంది.
రాగల 2 రోజుల్లో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణముకంటే 2-3 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువ గాను, రాగల 5 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు ఉండదు.
రాగల 2 రోజుల్లో రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణముకంటే 2-4 డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశముంది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానముగా తూర్పు/ఈశాన్య దిశల నుండి వీచుచున్నవి. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2°C నుండి 3°C వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆదివారం, సోమవారం, మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..