
బీహార్ నుండి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా కోస్తాంధ్ర తీరప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుంది.. దీంతోపాటు.. శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో అక్షం కలిగిన మధ్య, ఎగువ స్థాయి పశ్చిమ గాలులలోని ద్రోణి ఇప్పుడు ఈశాన్య బీహార్ నుండి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా తీరప్రాంత ఆంధ్రప్రదేశ్ వరకు విస్తరించి ఉంది. మన్నార్ గల్ఫ్, దానిని ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి విస్తరించి కొనసాగుతున్నది. దీని ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది.
ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
సోమవారం, మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30 -40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
సోమవారం, మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30 -40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30 -40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
గమనిక :- కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & యానాం, రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్న మరాత్వాడ ప్రాంతం నుండి ఆగ్నేయ అరేబియన్ సముద్ర ప్రాంతం, సమీపంలోని లక్ష దీవులు వరకు కొనసాగిన తూర్పు గాలుల్లో ద్రోణి ఈరోజు ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి దక్షిణ అంతర్గత కర్నాటక తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్, సమీపంలోని శ్రీలంక తీర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో కొనసాగుతోంది.
(Weather Forecast): రాగల 3 రోజులకు వాతావరణ సూచన: ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగి తదుపరి నాలుగు రోజుల్లో క్రమేపి రెండు నుంచి నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.
వాతావరణ హెచ్చరికలు (weather warnings):
ఈరోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు, 30 నుండి 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.