AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

Andhra Pradesh and Telangana Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. తీవ్రమైన ఉక్కపోత.. వేడిగాలుల నేపథ్యంలో.. జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి..

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
Weather Upadte
Shaik Madar Saheb
|

Updated on: Apr 18, 2026 | 3:13 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. తీవ్రమైన ఉక్కపోత.. వేడిగాలుల నేపథ్యంలో.. జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. అంతేకాకుండా.. విభిన్న పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ – యానంలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ – నైరుతి దిశగ గాలులు వీస్తున్నాయి.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం :-

గురువారం, శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు – బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. వేడి , తేమ – అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.

శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. వేడి, తేమ – అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

గురువారం, శుక్రవారం, శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వేడి , తేమ – అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.

రాయలసీమ :-

గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.

శుక్రవారం, శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వడ గాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది

గమనిక :- కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & యానాంలో రాగల 4 రోజుల్లో వేడి, తేమ – అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశముంది. రాయలసీమలో ఈరోజు రోజుల్లో వేడి , తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశముంది. కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & యానాం రాగల 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశముంది. ఆ తదుపరి గణనీయమైన మార్పు లేదు . రాయలసీమలో రాగల 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2-4డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశముంది.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు :

హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకారం.. నిన్న ఆగ్నేయ మధ్య ప్రదేశ్ నుండి ఉత్తర తమిళనాడు కొనసాగిన ఉత్తర-దక్షిణ ద్రోణి ఈరోజు ఈశాన్య మధ్యప్రదేశ్ ప్రాంతంలోని ఉపరితల చక్రవాత ఆవర్తనం నుండి విదర్భ, మరత్వాడ, అంతర్గత కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు సగటు సముద్రమట్టం నుండి 1.5 కి మీ ఎత్తు వరకు కొనసాగుతోంది.

రాగల 3 రోజులకు వాతావరణ సూచన:

గురువారం, శుక్రవారం, శనివారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణ ఉండే అవకాశం ఉంది. రానున్న మూడు రోజుల లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నష్టాలు, నమ్మకద్రోహాలు.. కాలసర్ప దోషంతో ఈ రాశులు జాగ్రత్త!
నష్టాలు, నమ్మకద్రోహాలు.. కాలసర్ప దోషంతో ఈ రాశులు జాగ్రత్త!
మీరు ఒక గంట పాటు మీ మొబైల్ లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
మీరు ఒక గంట పాటు మీ మొబైల్ లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
కళ్లు లేకుండా పుట్టిన శిశువు.. ఆస్పత్రికి రూ. 1 కోటి ఫైన్!
కళ్లు లేకుండా పుట్టిన శిశువు.. ఆస్పత్రికి రూ. 1 కోటి ఫైన్!
ముంబై, లక్నో దారిలోనే మరో 4 జట్లు.. లిస్ట్‌లో ఆ టీంపేరు?
ముంబై, లక్నో దారిలోనే మరో 4 జట్లు.. లిస్ట్‌లో ఆ టీంపేరు?
OTTని షేక్ చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTTని షేక్ చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ 2026 విడుదల.. రేపట్నుంచే దరఖాస్తులు
ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ 2026 విడుదల.. రేపట్నుంచే దరఖాస్తులు
బావులన్నీ గుండ్రంగానే ఎందుకు.. తాతల కాలం నాటి అసలైన ప్లాన్ ఇది!
బావులన్నీ గుండ్రంగానే ఎందుకు.. తాతల కాలం నాటి అసలైన ప్లాన్ ఇది!
బైక్‌లలో డీజిల్‌ ఎందుకు ఉపయోగించరు.. ఎవ్వరికి తెలియని రహస్యం ఇదే
బైక్‌లలో డీజిల్‌ ఎందుకు ఉపయోగించరు.. ఎవ్వరికి తెలియని రహస్యం ఇదే
బడ్జెట్ లో అదిరిపోయే రుచితో కొబ్బరన్నం కోడికూర చేసేయండి
బడ్జెట్ లో అదిరిపోయే రుచితో కొబ్బరన్నం కోడికూర చేసేయండి
ఈ రాశులకు విపరీత రాజయోగం..ఉద్యోగ పదోన్నతులు పక్కా..!
ఈ రాశులకు విపరీత రాజయోగం..ఉద్యోగ పదోన్నతులు పక్కా..!