AP news: కృష్ణాజిల్లా మచిలీపట్నం(machilipatnam)లో తీవ్ర విషాదం నెలకుంది. పబ్జీ ఆటలో ఓడిపోయానని.. ఓ బాలుడు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. వివరాల్లోకి వెళ్తే.. మచిలీపట్నంలోని హౌసింగ్ బోర్డుకు చెందిన ఊటుకూరు ప్రభు అనే 16 సంవత్సరాల బాలుడికి ఫోన్లో పబ్జీ ఆడటం వ్యసనంగా(PUBG addiction) మారింది. రోజూ గంటల తరబడి గేమ్ ఆడేవాడు. అయితే.. తాజాగా గేమ్‌లో ప్రభు ఓడిపోయాడు. ఈ క్రమంలోనే ఓడిపోయావంటూ ఫ్రెండ్స్ అతడిని గేలి చేశారు. టీనేజ్‌లో ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆవేశం, కోపం ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రభు క్షణికావేశంలో ఊహించని నిర్ణయం తీసుకన్నారు. ఓటమి బాధను జీర్ణించుకోలేక.. తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఊహించని పరిణామంతో ప్రభు కుటుంబం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. ఏదో సరదా కోసం ఆట ఆడుతున్నాడనుకుంటే.. ఆ మాయదారి గేమ్ తన బిడ్డ ప్రాణాలను తీసుకుపోడం తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఏ ఇంటా రావొద్దని గుండెలవిసేలా రోదిస్తున్నారు. ప్రభు మృతి పట్ల స్థానిక రాజకీయ నాయకులు విచారం వ్యక్తం చేశారు. పబ్జీ లాంటి గేమ్స్ వల్ల ఎంతో మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కొందరు పిచ్చివాళ్లు అయిపోతున్నారని.. పిల్లలను తల్లిదండ్రులు ఇలాంటి గేమ్స్‌కు దూరంగా ఉండేలా జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు. కాగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..