Andhra Pradesh: నవరత్నాలు కాదు.. నవ ఘోరాలకు పాల్పడుతున్నారు.. సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్

|

Jul 09, 2022 | 6:35 AM

సీఎం జగన్‌ (CM Jagan) పాలనలో ప్రజలు ఏ ఒక్కరూ సంతోషంగా లేరని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. చిత్తూరుజిల్లా నగరిలో పర్యటించిన బాబు.. వైసీపీ ప్రభుత్వంపై...

Andhra Pradesh: నవరత్నాలు కాదు.. నవ ఘోరాలకు పాల్పడుతున్నారు.. సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్
Chandrababu
Follow us on

సీఎం జగన్‌ (CM Jagan) పాలనలో ప్రజలు ఏ ఒక్కరూ సంతోషంగా లేరని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. చిత్తూరుజిల్లా నగరిలో పర్యటించిన బాబు.. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్దారు. ప్లీనరీ వేదికగా తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు బాబు. వైసీపీ (YCP) ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న బాబు.. నగరి నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడారు.వైసీపీ సర్కార్‌ ప్రజలపై పెనుభారం మోపుతుందోన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. జగన్‌ పాలన అవినీతి మయంగా మారిందని (Andhra Pradesh) దుయ్యబట్టారు. ప్రభుత్వం నవరత్నాలు కాదు.. నవ ఘోరాలకు పాల్పడుతోందన్నారు. ఏం సాధించారని ప్లీనరీ నిర్వహిస్తుందో జగన్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు చంద్రబాబు.

సీఎం జగన్‌ జనంలోకి వస్తే ప్రజల ఆగ్రహం అర్థమవుతుంది. పోలీసులను పెట్టుకుని తిరగడం కాదు. జగన్‌ తన చెల్లి,తల్లిని కూడా వదల్లేదు. ప్రజాస్వామికంగా తానూ రెండేళ్ల ఒకసారి పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నిక అవుతాను. జగన్‌ మాత్రం పార్టీకి శాశ్వత అధ్యక్షుడు. నాకు జగన్‌పై కోపం లేదు. కేవలం రాష్ట్రంపై ప్రేమ మాత్రమే ఉంది. అందుకే క్విట్‌ జగన్‌ అని నినాదమిస్తున్నా. దేశమంతా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తే.. ఏపీలో మాత్రం ముఖ్యమంత్రి జగన్‌ తగ్గించలేదు. మద్యం ధరలు పెంచి,వ్యక్తిగత ఆదాయం పెంచుకుంటున్నారు. ఇష్టారీతిన విద్యుత్‌ ఛార్జీలు, ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచారు. చివరకు చెత్తమీద కూడా పన్ను వేసిన ఘనత ఆయనకే చెందుతుంది. చేనేత కార్మికులకు జగన్ ఇచ్చిన పింఛన్ల హామీ ఏమైంది. అమరావతిని ఆపారు.. పోలవరాన్ని నాశనం చేశారు. గ్రామంలో డ్రైనేజీ కట్టలేని వ్యక్తి.. 3 రాజధానులు కడతారా? కాలువ తవ్వలేని వ్యక్తి సాగునీటి ప్రాజెక్టులు కడతారా?

       – నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

సీఎం జగన్‌ ఒకే ఒక్క ఆర్డరుతో 10 వేల పాఠశాలలు రద్దు చేశారన్నారు చంద్రబాబు. అమ్మఒడి పథకం పెద్దబూటకమని..నాన్న బుడ్డీ మాత్రం వాస్తవమని ఎద్దేవా చేశారు. పెగాసెస్ ఉపయోగించానని తనపై కేసు పెడతామంటూ బెదిరిస్తున్నారన్నారు.తానూ ప్రజలకు మాత్రమే భయపడతానని స్పష్టం చేశారు చంద్రబాబు