పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపీలకు దిశానిర్దేశం.. ఏం అంశాలను లేవనెత్తాలో సూచించిన మాజీ ముఖ్యమంత్రి..

|

Jan 29, 2021 | 5:45 AM

శుక్రవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలుకానున్నాయి. ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీల నేతలు ఏ అంశాలను లేవనెత్తాలో సమాలోచన చేసుకుంటున్నారు.

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపీలకు దిశానిర్దేశం.. ఏం అంశాలను లేవనెత్తాలో సూచించిన మాజీ ముఖ్యమంత్రి..
Follow us on

శుక్రవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలుకానున్నాయి. ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీల నేతలు ఏ అంశాలను లేవనెత్తాలో సమాలోచన చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైపల్యాలు, రాజ్యాంగ వ్యవస్థలపై జరుగుతున్న దాడి, పోలవరం, ప్రత్యేక హోదా అంశాలను పార్లమెంట్‌ సాక్షిగా ఎండగట్టాలని సూచించారు.

అమరావతిలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీలు గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని పాల్గొని పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి గురించి, వైకాపా చేసిన అప్పుల గురించి చర్చించినట్లు ఎంపీలు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలపై, పోలీసుల పనితీరుపై పార్లమెంట్‌ వేదికగా లేవనత్తనున్నట్లు తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న నిధులను దారిమళ్లిస్తూ అవి ప్రజలకు అందకుండా వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఎండగట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల దేవాలయాలపై జరుగుతున్న విధ్వంసాలను, మతమార్పిళ్లను పార్లమెంట్ దృష్టికి తీసుకెళుతామన్నారు.

ఏపీలో విద్యార్థుల కోసం ప్రత్యేక వెబ్​సైట్.. ఆశయాల వైపు పయనించేలా వినూత్న ఆలోచన