Mylavaram: కమ్మ, కాపు వేరు వేరు కాదు.. కులాలకు కొత్త భాష్యం చెప్పిన ఎమ్మెల్యే వసంత

టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్‌ కులోపదేశం చేశారు. పొలానికి కూలానికి లింక్‌ పెట్టారు. కమ్మ, కాపు భాయిభాయి అన్నారు. చిన్న కమ్మలెవరో, పెద్ద కమ్మలెవరో చెప్పేశారు. కమ్మ, కాపు కలిసి పనిచేస్తే అద్భుత ఫలితాలు వస్తాయన్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసుకుందాం పదండి...

Mylavaram: కమ్మ, కాపు వేరు వేరు కాదు.. కులాలకు కొత్త భాష్యం చెప్పిన ఎమ్మెల్యే వసంత
Vasantha Krishna Prasad

Updated on: Nov 10, 2025 | 8:07 PM

టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్‌ కామెంట్స్‌ ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. మైలవరంలో కాపు వన సమారాధన వేదికగా ఆయన కులాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సన్నిహితులంతా కాపువారేనన్నారు వసంతకృష్ణప్రసాద్‌. తన కంపెనీలను చూసుకుంటున్నది కూడా కాపులే అని చెప్పారు. తక్కువ పొలాలుంటే కాపువారని.. ఎక్కువ పొలాలుంటే కమ్మవారని అనేవారని చెప్పారు వసంతకృష్ణప్రసాద్‌.

కాపు కమ్యూనిటీ భవనానికి విరాళంగా 10లక్షలు ప్రకటించారు వసంతకృష్ణప్రసాద్‌. కాపులు, కమ్మ అనే భేదం వద్దన్నారు. కమ్మ, కాపు కలిసి పనిచేస్తే అద్భుత ఫలితాలు వస్తాయన్నారు.  టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్‌ కామెంట్స్‌ ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.