Andhra Pradesh: ‘అవును నేను రౌడీనే’.. సంచలన కామెంట్స్ చేసిన పరిటాల శ్రీరామ్..

|

Mar 30, 2022 | 11:46 PM

Andhra Pradesh: అనంతపురం రాజకీయాలు రోజు రోజుకు మరింత హీటెక్కుతున్నాయి. ముఖ్యంగా రాప్తాడులో రచ్చ రచ్చగా ఉంది పరిస్థితి.

Andhra Pradesh: ‘అవును నేను రౌడీనే’.. సంచలన కామెంట్స్ చేసిన పరిటాల శ్రీరామ్..
Partala Sri Ram
Follow us on

Andhra Pradesh: అనంతపురం రాజకీయాలు రోజు రోజుకు మరింత హీటెక్కుతున్నాయి. ముఖ్యంగా రాప్తాడులో రచ్చ రచ్చగా ఉంది పరిస్థితి. రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, టీడీజీ నేతలు పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వీరి మధ్య మాటలు తారాస్థాయికి చేరాయి. ఈ వివాదం నేపథ్యంలోనే తాజాగా పరిటాల శ్రీరామ్ సెన్షేషన్ కామెంట్స్ చేశారు. ప్రత్యర్థి నేతలు చేస్తున్న ఆరోపణలపై భగ్గమున్న ఆయన.. తీవ్రంగా స్పందించారు. ‘‘పరిటాల రవిని రౌడీ అనచ్చు, గూండా అనచ్చు. కానీ ఆ రోజు ప్రజల కోసం నిలబడ్డాడు కాబట్టే అలా ప్రచారం చేశారు. ఆ రోజు ఎన్టీఆర్ ధర్మవరం ప్రాంతంలో అరాచకాలను చూసే టీడీపీ జెండా ఇచ్చారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రచారమే చేస్తున్నారు. ప్రజలకు ఆపద కలిగించినప్పుడు ఎదుర్కొంటే రౌడీయిజం అయితే.. నేనూ రౌడీనే. అరాచకాలను కాలరాసే వారిని గూండాలంటే.. నేనూ గుండానే. వైసీపీ అరాచక వాదులకు నేను గూండాని, రౌడీనే’’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు. తమపై పచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తే చూస్తూ ఊరుకోబోమని అన్నారు.

Also read:

Big News Big Debate: 40 ఏళ్ల తెలుగుదేశం.. భవిష్యత్తుకు ఏది అభయం.. ప్రత్యేక కథనం..!

PM Modi – CM Kcr: ప్రధాన మంత్రికి లేఖ రాసిన సీఎం కేసీఆర్.. ఏం కోరారంటే..

Telangana Weather Alert: బాబోయ్ ఎండలు.. రాష్ట్రంలో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు..!