వైసీపీ(YCP) ప్రభుత్వ తీరుపై టీడీపీ(TDP) అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandrababu) ఫైర్ అయ్యారు. జగన్ పాలనపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసిందని, దానిని ఎవరూ ఆపలేరని అన్నారు. బాదుడే బాదుడు వైసీపీ ప్రభుత్వం పేదల నడ్డి విరిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం మోపిందని మండిపడ్డారు. కడపలో పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. జిల్లాలో అభివృద్ధి కోసం ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టారా అని ప్రశ్నించారు. పులివెందులలో బస్టాండ్ కట్టలేని వారు రాష్ట్రానికి మూడు రాజధానులు ఎలా కడతారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వరస అత్యాచార ఘటనలు, అంబులెన్సులు లేక బైక్ లపై మృతదేహాలు తీసుకెళ్లిన ఘటనలపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఒంగోలులో మహానాడు నిర్వహిస్తామంటే ఎందుకు అనుమతి ఇవ్వలేదని నిలదీశారు. జగన్ చేసేది ఉత్తుత్తి బటన్ నొక్కుళ్లే. ఈ పోరాటం నా కోసం కాదు.. బలహీన వర్గాల బాగుకోసమని చంద్రబాబు స్పష్టం చేశారు. కడప నుంచే టీడీపీ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు.
అధిక అప్పులతో జగన్ రాష్ట్ర పరువు తీశారు. సీఎం జగన్ చెప్పిన రాయలసీమ ఎత్తిపోతల ఏమైంది? నిజాలు చెబితే వెంకాయమ్మ ఇంటిపై దాడి చేశారు. సీబీఐ కేసుల్లో వాదించిన వారికి, తనతో కేసుల్లో ఉన్నవారికి జగన్ రాజ్యసభ అభ్యర్థిత్వం ఇచ్చారు. పులివెందులలో బస్టాండ్ కట్టలేని వారు 3 రాజధానులు కడతారా? పులివెందులలో రైతులకు ఎందుకు బీమా రావడం లేదో సీఎం చెప్పాలి. సమస్యలు చెప్పే వారిపై కేసులు పెడుతున్నారు. వైసీపీ పాలనలో పేదల జీవితాలు చితికిపోయాయి.
– చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇదీ చదవండి
Andhra Pradesh: జగన్ సర్కార్ అనూహ్యం నిర్ణయం.. ఆ జిల్లా పేరు మార్పు..