Pawan Kalyan-Lokesh: టీడీపీ-జనసేన మాస్టర్ ప్లాన్.. రాజమండ్రి వేదికగా పవన్ కల్యాణ్, లోకేష్ భేటీ.. నెక్స్ట్ అదేనా..

Andhra Pradesh Politics: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలులో ఉన్న విషయం తెలిసిందే. కోర్టులో పిటిషన్ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో.. చంద్రబాబు జైలు నుంచి విడుదల కావడం మరింత ఆలస్యం అవుతుంది. మరోవైపు సుప్రీంకోర్టులో క్యాష్ పిటిషన్ పై తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి.. దీంతో ఇక ఆలస్యం చేయకుండా టీడీపీ, జనసేన రంగంలోకి దిగాలని ఫిక్స్ అయ్యాయి..

Pawan Kalyan-Lokesh: టీడీపీ-జనసేన మాస్టర్ ప్లాన్.. రాజమండ్రి వేదికగా పవన్ కల్యాణ్, లోకేష్ భేటీ.. నెక్స్ట్ అదేనా..
Pawan Kalyan - Nara Lokesh

Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 21, 2023 | 9:15 PM

Andhra Pradesh Politics: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలులో ఉన్న విషయం తెలిసిందే. కోర్టులో పిటిషన్ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో.. చంద్రబాబు జైలు నుంచి విడుదల కావడం మరింత ఆలస్యం అవుతుంది. మరోవైపు సుప్రీంకోర్టులో క్యాష్ పిటిషన్ పై తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి.. దీంతో ఇక ఆలస్యం చేయకుండా టీడీపీ, జనసేన రంగంలోకి దిగాలని ఫిక్స్ అయ్యాయి.. టీడీపీ, జనసేన తొలి సమన్వయ కమిటీ తేదీని ఖరారు చేసుకున్నాయి.. రాజమండ్రిలో ఈనెల 23వ తేదీన టీడీపీ, జనసేన పార్టీలు తొలిసారి భేటీ కాబోతున్నాయి. దీంతో టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యచరణ దిశగా కసరత్తు జరుగుతుంది. జనసేన తరపున ఐదుగురు కమిటీ సభ్యులు, టీడీపీ తరఫున ఐదుగురు కమిటీ సభ్యులను ఇరుపార్టీలు నియమించాయి. పవన్ కల్యాణ్, లోకేష్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ ఇరుపార్టీల సమన్వయంపై భేటీ జరగనుంది. ఈ కీలక సమావేశానికి రాజమండ్రి వేదిక చేశారు. చంద్రబాబు జైలులో ఉన్న రాజమండ్రినే భేటీకి వేదికగా నిర్ణయించారు ఇరు పార్టీల నేతలు.. ఈ సందర్భంగా రాజకీయ కార్యక్రమాలను స్పీడ్ పెంచేలా ఇరు పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విడుదల కోసం ఎదురుచూస్తూ ఉండటం కన్నా.. ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నరు. ఇలాంటి తరుణంలో ఈనెల 23న రాజమండ్రి వేదికగా ఇరు పార్టీలు భేటి కానున్నాయి. రాజకీయ కార్యక్రమాలు మరింత వేగవంతం చేసేలా కమిటీకి అధినేతలు దిశానిర్దేశం చేయనున్నారు. ఉమ్మడి కార్యాచరణ , టికెట్ల సద్దుబాటు, వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన ఉమ్మడి మేనిఫెస్టో వంటి అంశాలు తదితర వాటిపై ఇరు పార్టీలు ఇక వరుసగా సమావేశం అయ్యే అవకాశం ఉంది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సీట్ల సర్దుబాటు వ్యవహారంపై చర్చించే అవకాశం కనబడుతుంది.

చంద్రబాబు అరెస్ట్ అనంతరం టీడీపీ నేతలు ఆత్మస్థైర్యం కోల్పోయారు. వారిలో ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉమ్మడి కార్యాచరణ ప్రకటించే అవకాశం కనబడుతుంది. టీడీపీ పోటీ చేసే స్థానాలు, జనసేన పోటీ చేసే స్థానాలపై పవన్ కల్యాణ్ లోకేష్ మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు దసరా తర్వాత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుంది.. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు అనుసరించవలసిన వ్యవహారాలు, వ్యూహాలుపై ఈ భేటీలో చర్చించనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..