Chandrababu: కౌరవసభలో అడుగు పెట్టను.. గెలిచి సభకు గౌరవం తెస్తా.. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది: చంద్రబాబు

|

Nov 26, 2021 | 4:43 PM

Chandrababu: ఏపీ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికార పార్టీపై, ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తాను కౌరవ సభలో ఉండలేనంటూ..

Chandrababu: కౌరవసభలో అడుగు పెట్టను.. గెలిచి సభకు గౌరవం తెస్తా.. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది: చంద్రబాబు
Babu Vs Jagan
Follow us on

Chandrababu: ఏపీ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికార పార్టీపై, ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తాను కౌరవ సభలో ఉండలేనంటూ సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు మళ్ళీ అసెంబ్లీలో గెలిచిన తర్వాత మాత్రమే అడుగు పెడతానంటూ శబధం చేశారు చంద్రబాబు. తాను మళ్ళీ గెలిచి అసెంబ్లీ లో అడుగు పెట్టి.. గౌరవ సభ గా తీర్చిదిద్దుతానని చంద్రబాబు చెప్పారు. సీఎం జగన్ రెడ్డి గాలి మాటలు మాట్లాడుతున్నాడు..తాను ఎందరో ముఖ్యమంత్రులను చూసానని అన్నారు. సీఎం జగన్ రెండున్నర సంవత్సరాల్లో కడపజిల్లాకి ఒక్క రూపాయి అభివృద్ధి కార్యక్రమాలైనా చేశారా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.

వర్షాల గురించి ముందే వాతావరణ శాఖ హెచ్చరించింది.. ప్రాజెక్ట్ లోకి ఇన్ ఫ్లో ఎక్కువ వచ్చినప్పుడు ప్రభుత్వం, అధికారులు ఏమి చేస్తున్నారంటూ చంద్రబాబు ప్రశ్నించారు. అంతేకాదు అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు సరైన సమయంలో ఎత్తలేదని అందుకనే గ్రామాలకు గ్రామాలు కొట్టుకు పోయాయన్నారు.

ఇక ఏపీలో ఇసుక మాఫియా చెలరేగి పోతోందంటూ చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. వరదబాధితులను చూడడానికి సీఎం గాలిలో వచ్చారు.. గాలిలో వెళ్తున్నారంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు సీఎం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఒక ఎమ్మెల్యే చెరువు లో క్రికెట్ స్టేడియం కట్టుకున్నాడు. మొత్తంగా జగన్ ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడం లో విఫలమయ్యింది అంటూ చంద్రబాబు చెప్పారు. ఏపీ రాష్ట్రాన్ని కాపాడటం చారిత్రక అవసరని అన్నారు. మద్యం ఆదాయం తో సంక్షేమం చేస్తామని..చట్టం చేశారు.. మంగళ సూత్రాలు తాకట్టు పెడతారా..అంటూ ప్రభుత్వ తీరుపై తీవ్ర పదజాలంతో చంద్రబాబు విరుచుకుపడ్డారు.

Also Read:   రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలను నాటిన గోపికమ్మ.. మరో ముగ్గురు బాలీవుడ్ హీరోలకు ఛాలెంజ్

 చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి తదితరులు.. ఇకపై వలసపక్షులకు చోటు లేదని అధినేత స్పష్టం..