Chandra Babu: రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.. ఆయన సీఎం అయ్యాకే రాష్ట్రానికి నష్టం ఎక్కువ

|

Feb 09, 2023 | 8:22 PM

ఒకటీ Vs మూడు. ఏపీలో రాజధానిపై మళ్లీ రాజకీయం రగులుతోంది. సుప్రీంకోర్టులో కేంద్రం వేసిన అఫిడవిట్‌ రాష్ట్రంలో కాక పుట్టిస్తోంది. రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని గట్టిగా చెబుతోంది టీడీపీ. ఆ అధికారం రాష్ట్రానికే ఉందంటోంది వైసీపీ. మరోవైపు ముందస్తు ముచ్చటా రాజకీయాన్ని హీటెక్కిస్తోంది. 

Chandra Babu: రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.. ఆయన సీఎం అయ్యాకే రాష్ట్రానికి నష్టం ఎక్కువ
Chandrababu Naidu
Follow us on

వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. పార్లమెంట్‌లో చట్టం చేసి అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత .. మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. విశాఖలో రాజధాని సాధ్యం కాదని తెలిసి కూడా.. ప్రజల్ని మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌పైనా కీలక కామెంట్స్‌ చేశారు చంద్రబాబు. రాష్ట్రంలోని అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. చివరికి జడ్జీల ఫోన్లు సైతం ట్యాపింగ్ అవుతున్నాయని అన్నారు బాబు. లేని అధికారాన్ని ఆపాదించుకుని రాజ్యాంగంపై చేసిన ప్రమాణానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం ఆలోచించకుండా ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. విభజన చట్టం సెక్షన్ 5లో రాజధాని పై స్పష్టంగా ఉన్నా.. 3రాజధానుల నిర్ణయం తీసుకున్నారని ఆక్షేపించారు. అన్నీ సర్వేలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నాయని అన్నారు చంద్రబాబు. అందుకే ముందస్తుకు వెళ్లే ఆలోచన చేస్తున్నారని చెప్పారు.

అమరావతి నిర్మాణం ముందుకు సాగి ఉంటే పన్నుల రూపేణా రాష్ట్రమంతటికీ ఆదాయం వచ్చి ఉండేదని పేర్కొన్నారు. ప్రజా వేదికతో ప్రారంభమైన అమరావతి విధ్వంసం ఇప్పుడు రోడ్లు తవ్వేసేదాకా వచ్చిందని విమర్శించారు. అంబేడ్కర్ విగ్రహాలను సైతం వదలకుండా విధ్వంసం సాగిస్తున్నారని మండిపడ్డారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం