AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఉచితంగా ఇంటర్‌తో పాటు IIT,JEE కోచింగ్ పొందే ఛాన్స్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అభివృద్ది కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటుంది. తాజాగా అలాంటి ఓ నిర్ణయమే ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్రంల్లోని ముస్లింగ్ విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తలీమ్‌-ఇ-హునార్‌ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం 500 మందికి వక్ఫ్ బోర్డు నిధులతో కార్పొరేట్ కాలేజీల్లో ఉచిత జేఈఈ, నీట్ శిక్షణ ఇవ్వనుంది. మైనారిటీల ఉన్నత విద్యకు పెద్దపీట వేసే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.

ఆ విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఉచితంగా ఇంటర్‌తో పాటు IIT,JEE కోచింగ్ పొందే ఛాన్స్!
Ap Government Schemes
Anand T
|

Updated on: Apr 19, 2026 | 10:17 AM

Share

రాష్ట్రంలోని ముస్లిం విద్యార్థులకు ఉన్నమైన విద్య, మంచి భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సరికొత్త పథకాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. వక్ఫ్ బోర్డు నుంచి వచ్చే ఆదాయాన్ని రాష్ట్రంలోని ముస్లిం విద్యార్థుల అభివృద్ధికి ఉపయోగించాలనే ఉద్దేశంతో తలీమ్‌-ఇ-హునార్‌ అనే కొత్త పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకం కింది ప్రతి ఏడాది 500 మంది ముస్లిం పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు కార్పొరేట్ కాలేజీల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్యతో పాటు, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.

ఈ పథకం కింద ప్రభుత్వం ఒక్కో విద్యార్థి చదువు, వసతి కోసం ఏడాదికి సుమారు రూ. 2 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. అయితే ఈ పథకానికి అయ్యే ఖర్చు మొత్తం పూర్తిగా వక్ఫ్ బోర్డే బరించనుంది. ఇక ఈ పథకానికి అర్హులను ఎంపిక చేసేందుకు మైనారిటీ సంక్షేమ శాఖ కొన్ని విధివిదానాలను తీసుకొచ్చింది. రాష్ట్రంలో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు టాలెంట్‌ టెస్ట్‌ పెట్టి మంచి ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేయనున్నారు. వచ్చే నెలలో ఈ పరీక్షను నిర్ణహించనున్నారు. ఈ పరీక్షలో ప్రతిభ చాటిన విద్యార్థులు తమకు ఇష్టమైన కార్పొరేట్ కళాశాలల్లో ఉంచితంగా చదువుకునే అవకాశం కల్పిస్తారు. అలాగే జేఈఈ, ఐఐటీ వంటి పరీక్షలకు శిక్షణ కూడా ఇప్పిస్తారు. రాబోయే విద్యా సంవత్సరం నుండి ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.

ఇదిలా ఉండగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వక్ఫ్ బోర్డు స్థలాల్లో నడుస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలు, తాము చెల్లించాల్సిన అద్దెకు బదులుగా.. అంతే మొత్తానికి సమానమైన విలువ గల విద్యను ముస్లిం విద్యార్థులకు ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని కాలేజీల్లో దీన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా విద్యార్థులు ఎలా చదువుతున్నారనే అంశాన్ని వక్ఫ్ బోర్డు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ రాశులకు జీవితంలో అనూహ్య పురోగతి..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఈ రాశులకు జీవితంలో అనూహ్య పురోగతి..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
యజమాని తమ్ముడితో ఎఫైర్ పెట్టకున్న మహిళతోనే అతనికి సాన్నిహిత్యం..
యజమాని తమ్ముడితో ఎఫైర్ పెట్టకున్న మహిళతోనే అతనికి సాన్నిహిత్యం..
వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. అసలు సీక్రెట్ ఏంటంటే..?
వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. అసలు సీక్రెట్ ఏంటంటే..?
కాజీరంగాలో అరుదైన బంగారు పులి దర్శనం.. ఈ ప్రత్యేక రంగు వెనుక ఉన్న
కాజీరంగాలో అరుదైన బంగారు పులి దర్శనం.. ఈ ప్రత్యేక రంగు వెనుక ఉన్న
మొదట్లో రూ.500 ఇచ్చారు.. ఇప్పుడు ఒకొక్క ఎపిసోడ్‌కు..
మొదట్లో రూ.500 ఇచ్చారు.. ఇప్పుడు ఒకొక్క ఎపిసోడ్‌కు..
అలసట నుంచి తిమ్మిర్ల వరకు.. అవన్నీ విటమిన్ B12 లోపం వల్లే..
అలసట నుంచి తిమ్మిర్ల వరకు.. అవన్నీ విటమిన్ B12 లోపం వల్లే..
NEET PG అడ్మిట్ కార్డు విడుదల తేదీలో మార్పు.. మరికొన్ని గంటల్లోనే
NEET PG అడ్మిట్ కార్డు విడుదల తేదీలో మార్పు.. మరికొన్ని గంటల్లోనే
రేసింగ్ ట్రాక్‌పై ప్రమాదానికి గురైన అజిత్ కారు..
రేసింగ్ ట్రాక్‌పై ప్రమాదానికి గురైన అజిత్ కారు..
కోటి దేవతల కంటే ఒక్క విగ్రహం తక్కువ! త్రిపురలోని ఉనకోటి వెనుక..
కోటి దేవతల కంటే ఒక్క విగ్రహం తక్కువ! త్రిపురలోని ఉనకోటి వెనుక..
ధోని రికార్డ్‌‌నే బద్దలు కొట్టిన రిషబ్ పంత్.. అదేంటంటే?
ధోని రికార్డ్‌‌నే బద్దలు కొట్టిన రిషబ్ పంత్.. అదేంటంటే?