Legal Awareness: భార్యని భర్త ఖర్చుల లెక్కలు అడగటం తప్పా? సుప్రీం కోర్టు ఏం చెప్పింది..?

భార్యను ఖర్చుల వివరాలు అడగడం మానసిక క్రూరత్వం కాదని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. భర్త తన ఆదాయాన్ని తల్లిదండ్రులకు పంపించడం అతని వ్యక్తిగత విషయం. భార్య వేసిన 498A, డొమెస్టిక్ వైలెన్స్ కేసులలోని కొన్ని ఆరోపణలను సుప్రీం కోర్టు రద్దు చేసింది. భర్తకు ఆర్థిక విషయాలపై స్పష్టత అడిగే హక్కు ఉందని ఈ తీర్పు స్పష్టం చేస్తుంది.

Legal Awareness: భార్యని భర్త ఖర్చుల లెక్కలు అడగటం తప్పా? సుప్రీం కోర్టు ఏం చెప్పింది..?
Legal Awareness

Updated on: Jan 02, 2026 | 7:59 PM

భార్యను ఆమె ఖర్చుల వివరాలు అడగడం, లేదా భర్త ఇచ్చిన డబ్బులకు లెక్కలు అడగడం మానసిక క్రూరత్వం (మెంటల్ క్రూయల్టీ) కిందకు రాదని సుప్రీం కోర్టు ఇటీవల ఒక ముఖ్యమైన తీర్పులో స్పష్టం చేసినట్లు ప్రముఖ అడ్వకేట్ రమ్య తెలియజేశారు. వివాహ సంబంధాలలో ఆర్థిక విషయాలపై పారదర్శకత, స్పష్టత కోరడం అనేది భర్త హక్కు అని ఈ తీర్పు తేటతెల్లం చేసింది. ఆధునిక సమాజంలో కుటుంబ తగాదాలు, విడాకుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ తీర్పు ప్రాముఖ్యతను సంతరించుకుంది. పెళ్లిళ్లలో చూపించే హడావుడి, ఖర్చులు మూడు సంవత్సరాలు కూడా నిలబడకుండానే పలు వివాహ బంధాలు తెగిపోతున్నాయని అడ్వకేట్ రమ్య పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, భార్యను ఖర్చుల వివరాలు అడగడం క్రూరత్వమా అనే సందేహానికి సుప్రీం కోర్టు తెరదించింది.

కేసు పూర్వాపరాలోకి వెళ్తే..  ఈ తీర్పు సరూర్ నగర్ పరిధిలోని ఒక కేసు నేపథ్యంలో వెలువడింది. 2016లో వివాహమైన ఒక జంట 2019 వరకు కలిసి ఉన్నారు. వీరు యు.ఎస్.లో కూడా నివసించి, వారికి ఒక బాబు కూడా ఉన్నాడు. 2019 నుంచి వారి మధ్య విభేదాలు తలెత్తాయి. 2022లో భార్య తన భర్తపై వరకట్న వేధింపులు (498A), గృహ హింస (డొమెస్టిక్ వైలెన్స్), భరణం (మెయింటెనెన్స్) కేసులను నమోదు చేసింది. తన భర్త తన ఖర్చుల కోసం సరైన డబ్బు ఇవ్వడం లేదని, ఇచ్చిన డబ్బులకు లెక్కలు అడుగుతున్నాడని, తన ఆదాయంలో ఎక్కువ భాగం తల్లిదండ్రులకు పంపుతున్నాడని,  పిల్లలను సరిగా చూసుకోవడం లేదని ఆరోపించింది. ఇంట్లో చిన్నపాటి విషయాలపై, వంట సరిగా చేయలేదని, ఇల్లు తుడవలేదని, అత్తమామలతో మాట్లాడలేదని కూడా వేధిస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

భార్య పెట్టిన కేసుల ఆధారంగా నమోదైన ఎఫ్.ఐ.ఆర్.ను రద్దు చేయాలని (క్వాష్ పిటిషన్) కోరుతూ భర్త తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే, తెలంగాణ హైకోర్టులో అతనికి అనుకూలమైన తీర్పు రాలేదు. దీంతో భర్త సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. సుప్రీం కోర్టు ఈ కేసును విచారించి భర్తకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో పలు అంశాలను స్పష్టం చేసింది.

ఖర్చుల వివరాలు అడగడం క్రూరత్వం కాదు:  భార్యకు ఇచ్చిన డబ్బులకు లేదా ఆమె చేసే ఖర్చులకు వివరాలు అడగడం అనేది మానసిక క్రూరత్వం కిందకు రాదు. ఇది రోజువారీ జీవితంలో జరిగే ఒక చిన్నపాటి తగాదా లేదా “సాధారణ న్యూసెన్స్” మాత్రమేనని, దీనిని నేరంగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది.

తల్లిదండ్రులకు డబ్బు పంపే హక్కు:  భర్త తన ఆదాయంలో కొంత భాగాన్ని తన తల్లిదండ్రులకు పంపడం అనేది అతని వ్యక్తిగత ఇష్టం. దీనిని ప్రశ్నించే హక్కు భార్యకు లేదని కోర్టు స్పష్టం చేసింది.