Vijayawada: రోడ్డుపై వెళ్తున్న స్టూడెంట్స్ బ్యాగులు చెక్ చేసి స్టన్ అయిన పోలీసులు

|

Jun 15, 2023 | 5:42 PM

Penamaluru: మీ పిల్లలు అస్సలు బంక్ కొట్టకుండా డైలీ కాలేజ్‌కు వెళ్తున్నారా..? సాయకాలం స్నేహితులతో కంబైన్డ్ స్టడీస్‌కు వెళ్తున్నారా..? అయితే ఎందుకైనా మంచిది. అప్పుడప్పుడు కాలేజ్‌కి వెళ్లి వారి ప్రవర్తనపై కూడా ఎంక్వైరీ చేయండి. అటెండెన్స్ డీటేల్స్ తీసుకోండి..

Vijayawada: రోడ్డుపై వెళ్తున్న స్టూడెంట్స్ బ్యాగులు చెక్ చేసి స్టన్ అయిన పోలీసులు
Vijayawada Police
Follow us on

చదువుకుని.. మంచి స్థాయికి వెళ్లాల్సిన పిల్లలు. చెడు సావాసాలతో.. జీవితాలను గందరగోళం చేసుకుంటున్నారు. మత్తు పదార్థాల మాయలో పడి ఆరోగ్యాన్ని.. అందమైన భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. పుస్తకాలుండాల్సిన కాలేజ్ బ్యాగుల్లో ఏకంగా గంజాయి కట్టలను రవాణా చేస్తున్నారు. అనడానికి వినడానికే ఇబ్బందిగా ఉన్న ఇటువంటి అవారా సీన్లు అక్కడ చాలా రొటీన్. మత్తుకు అలవాటవడమే కాదు… ఈజీ మనీ కోసం కాలేజ్ ఎగ్గొట్టి గంజాయి చేత పడుతున్నారు స్టూడెంట్స్. ఈ ఇష్యూ లైట్ తీసుకోవడానికి లేదు. కృష్ణా జిల్లాలో గంజాయి వినియోగం విపరీతంగా పెరిగిందని.. రిపోర్ట్ అందుతుంది.

ఒక్క పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఏడు గంజాయి స్మోకింగ్ జోన్స్ గుర్తించారు పోలీసులు. టీవీ9తో కలిసి పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేశారు. ఆకస్మిక దాడుల్లో 16 మంది దొరికారు. పాతిక కిలోల గంజాయి స్వాధీనమైంది. ఇలా… గంజాయి తాగుతూ,అమ్ముతూ పట్టుబడ్డ వారిలో విజయవాడ విద్యార్థులే ఎక్కువ. గంజాయితో పట్టుబడితే తాట తీస్తామని, చెడు వ్యసనాలకు బానిసలుగా మారి భవిష్యత్తుని పాడుచేసుకోవద్దని పెనమలూరు పోలీసులు సూచిస్తున్నారు.

గంజాయికి ఒక్కసారి అలవాటుపడితే వదలడం చాలా కష్టం. అతి కష్టం మీద డీ అడిక్షన్ సెంటర్లకు వెళ్తే కానీ బయట పడే వీలు లేదు. అందుకే పేరెంట్స్ కూడా మీ పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వారి ప్రవర్తనలో తేడాలను గమనించాలి. తరుచుగా వారి గురించి స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లి ఎంక్వైరీ చేయాలి.  పర్యవేక్షణ కరువయితే వారు తప్పుడు మార్గాల్లో వెళ్లే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..