శ్రీకాకుళం జిల్లాలో యువకుడికి చిక్కిన వింత చేప.. దాని పేరు కూడా మత్సకారులకు తెలియదట..!

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గతంలో చాలాసార్లు మత్సకారులకు అరుదైన చేపలు చిక్కాయి. కానీ వింత చేపలు దొరికిన ఘటనలు ఎప్పుడైనా చూశారా..? లేదు కదా.

శ్రీకాకుళం జిల్లాలో యువకుడికి చిక్కిన వింత చేప.. దాని పేరు కూడా మత్సకారులకు తెలియదట..!

Updated on: Jan 25, 2021 | 4:29 PM

Rare fish in srikakulam: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గతంలో చాలాసార్లు మత్సకారులకు అరుదైన చేపలు చిక్కాయి. కానీ వింత చేపలు దొరికిన ఘటనలు ఎప్పుడైనా చూశారా..? లేదు కదా. ఇప్పుడు అలాంటి వింత చేపను చూపించబోతున్నాం. విచిత్రమేమిటంటే ఈ చేప పేరు కూడా స్థానిక మత్సకారులకు తెలియదట. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లాలోని రాజాం మండలం కొత్త అమరాంకు చెందిన సతీష్ అనే వ్యక్తి ఆదివారం చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. అతడికి ఈ వింత చేప చిక్కింది.

చూడటానికి పాములా.. ఒంటిపై నల్లటి చారలు ఉన్నాయి. ఇలాంటి అరుదైన చేపను ఇప్పటి వరకు చూడలేదని, దీనిపేరు కూడా తమకు తెలియదని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. కాస్త వింతగా ఉండటంతో చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు ఈ చేపను ఆసక్తిగా చూశారు. స్థానిక చెరువులో ఈ అరుదైన చేప దొరకడం వారికి ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో కురిసిన వర్షాల సమయంలో.. ఈ చేప చెరువులోకి చేరి ఉండొచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Also Read:

Actress Jayashree Suicide: షాకింగ్ న్యూస్.. బిగ్ బాస్ ఫేమ్ జయశ్రీ ఆత్మహత్య.. తీవ్ర ఒత్తిడితో..!