Small Mistake: గుడిలో చోరీకి వచ్చిన దొంగ.. లైట్ ఆన్ చేయబోయి.. మరో స్విచ్ నొక్కాడు.. కట్ చేస్తే..

ఆలయంలోకి చొరబడ్డ దొంగ లైట్‌ స్విచ్‌ ఆన్‌ చేయబోయి, ఢంకా స్విచ్‌ నొక్కడంతో గ్రామస్తులు అప్రమత్తం అయ్యారు. ఢంకా శబ్దం విని పారిపోతున్న దొంగ..

Small Mistake: గుడిలో చోరీకి వచ్చిన దొంగ.. లైట్ ఆన్ చేయబోయి.. మరో స్విచ్ నొక్కాడు.. కట్ చేస్తే..
Thief Small Mistake

Updated on: Dec 02, 2022 | 10:58 AM

దొంగతనం చేసేందుకు ఏకంగా గుడినే ఎంచుకున్నాడు ఓ ఘనుడు. ఎవరూ లేని సమయం చూసి ఎంచక్కా ఆలయంలోకి ప్రవేశించిన ఆ దొంగ.. ముందుగా తాళాలు పగులగొట్టి గుడిలోని హుండీని ఎత్తుకెళ్లేందకు ప్లాన్ చేశాడు. తాను అనుకున్నట్లేగా ప్లాన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కాని, ఈ దొంగ చేసిన మొదటి పొరపాటే పట్టించింది. అంతా గప్ చుప్‌గా దోపిడీ చేసుకుపోదామని వస్తే అడ్డంగా దొరికిపోయేలా చేసింది. అతను చేసిన చిన్న పొరపాటు. ఒకటి నొక్కాల్సింది.. మరొకటి నొక్కాడు.. అంతే క్షణాల్లో గ్రామస్థులు, ఆలయ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఈ చోరీ ఘటన శ్రీకాకుళం జిల్లాలో ఓ ఆలయంలో జరిగింది. ఆలయంలోకి వచ్చిన ఆ దొంగ చేసిన చిన్న పొరపాటు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గ్రామ శివారులో ఉన్న ఆ శివాలయంను ముందుగా ఎంచుకున్నాడు. ఎందుకంటే చీకటి పడిందంటే అటుగా ఎవరూ రాని అనుకున్నాడు. ఏం చక్కా చికటి పడేవరు అక్కడ ఉండి.. ఆలయ పూజరి వెళ్లిపోయిన తర్వాత గుడిలోకి వచ్చాడు. లోపలికి వెళ్లాడు.. అందులో అంతా చీకటిగా ఉండటంతో అలవాటులో పొరపాటున లైట్ స్విచ్ ఆన్ చేయబోయాడు.. అంతే పెద్ద శబ్ధంతో ఢంకా శబ్ధం మొదలైంది. ఢంకా స్విచ్‌ నొక్కడంతో గ్రామస్తులు అప్రమత్తం అయ్యారు. ఇంత రాత్రి సమయంలో ఆలయంలో పూజలేంటని పరుగు పరుగునా అక్కడికి వచ్చారు. తీరా చూస్తే పరుగులు పెడుతున్న ఓ వ్యక్తిని పట్టుకుని ఆరా తీస్తే అసలు సంగతి బయట పడింది.

ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా మామిడవలస శివాలయంలో జరిగింది. చోరీకి యత్నించిన దొంగ చిన్న పొరపాటుతో అడ్డంగా దొరికిపోయాడు. ఆలయంలోకి చొరబడ్డ దొంగ లైట్‌ స్విచ్‌ ఆన్‌ చేయబోయి, నిత్యం హారతి సమయంలో బాజా భజంత్రీ కోసం వేసే ఢంకా స్విచ్‌‌ను నొక్కడంతో గ్రామస్తులు అప్రమత్తం అయ్యారు. ఢంకా శబ్దం విని పారిపోతున్న దొంగ ఒకరిని పట్టుకొని, చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు.

మరిన్న ఏపీ న్యూస్ కోసం