Andhra Pradesh: ఏపీ విద్యార్ధులకు అలెర్ట్.. ఆ రోజు అన్ని స్కూళ్లకు సెలవు.. వివరాలివే.!

|

Mar 28, 2023 | 6:18 PM

ఏపీ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. శ్రీరామనవమి పండుగ పురస్కరించుకుని మార్చి 30వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా..

Andhra Pradesh: ఏపీ విద్యార్ధులకు అలెర్ట్.. ఆ రోజు అన్ని స్కూళ్లకు సెలవు.. వివరాలివే.!
Ap Schools
Follow us on

ఏపీ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. శ్రీరామనవమి పండుగ పురస్కరించుకుని మార్చి 30వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు దినంగా ప్రకటించింది జగన్ సర్కార్. అలాగే ఆ రోజున ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఈ సెలవు వర్తిస్తుంది.

ఇక అటు రాష్ట్రంలో ఒంటిపూట బడులను ఏప్రిల్ 4వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో.. ఈ ఎగ్జామ్స్ నిర్వహించే సెంటర్ల(స్కూల్స్)లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించనున్నారు.

మరోవైపు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులను ఇవ్వనున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అనంతరం జూన్ 12న స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నాయి.