AP News: ఆ దేవాలయానికి చేరుకోవాలంటే యజ్ఞమే.. ఎక్కడంటే?

| Edited By: Velpula Bharath Rao

Oct 11, 2024 | 3:41 PM

కడప జిల్లాలోని గోపవరం మండలం అటవీ ప్రాంతంలో ఉన్న మల్లం కొండేశ్వర స్వామి దేవాలయం అంటే భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలు కలిగి ఉంటారు. కడప మరియు నెల్లూరు జిల్లాలకు సరిహద్దు ప్రాంతంగా ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది పరమశివుడు మల్లెం కొండేశ్వరుడిగా ఇక్కడ వెలిశాడని భక్తులు విశ్వసిస్తారు.

AP News: ఆ దేవాలయానికి చేరుకోవాలంటే యజ్ఞమే.. ఎక్కడంటే?
Sree Mallemkondeswara Swamy
Follow us on

కడప జిల్లాలోని గోపవరం మండలం అటవీ ప్రాంతంలో ఉన్న మల్లం కొండేశ్వర స్వామి దేవాలయం అంటే భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలు కలిగి ఉంటారు. కడప మరియు నెల్లూరు జిల్లాలకు సరిహద్దు ప్రాంతంగా ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది పరమశివుడు మల్లెం కొండేశ్వరుడిగా ఇక్కడ వెలిశాడని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడి కొండలలోని కొలనులో స్నానం చేస్తే సకల రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి సంతానం కలుగుతుందని నమ్మకం ఉంది. పూలమాల ఆకృతిలో ఈ గిరి శిఖరం ఉంటుంది. ఈ శిఖరానికి మాల్యాద్రి శిఖరం అని కూడా పేరు.. ఈ శిఖరం మీద కాశీ విశ్వనాథులు మల్లెం కొండేశ్వరుల ఆలయాలు కనువిందు చేస్తాయి.. ఆలయం నుంచి మరో రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళితే రామసరి జలపాతం..

ఇక్కడ పులులు కూడా సంచరించావు. గోపవరం అంతేకాకుండా పక్కనే ఉన్న లంకమల అటవీ ప్రాంతంలో పులల సంచారం ఉంటుంది. కానీ పక్కనే పుల్లలు సంచారం ఉన్నా ఇంతవరకు ఈ దేవాలయం పరిసర ప్రాంతాలలోనికి పులులు కూడా రావని గ్రామస్తులు చెబుతున్నారు. శ్రీరామచంద్రమూర్తి రావణ సంహారం అనంతరం సీతమ్మ వారితో కలిసి ఈ మాల్యవంత పర్వత ప్రాంతానికి వచ్చారని ఇక్కడి ప్రజలు చర్చించుకుంటారు అప్పుడే మల్లెం కొండలు ఒక శివలింగాన్ని ప్రతిష్టించినట్లు ఎక్కడి స్థల పురాణం చెబుతుంది. ఈ క్షేత్రానికి 8 దిక్కులలోను నీటి గుంటలు ఏర్పాటు చేశారని పురణాలు చెబుతున్నాయి. ఈ నీటి కుంటలలో స్నానం చేస్తే సకల రోగాలు పోతాయని నానుడి ఉంది.

కొండమీద మల్లం కొండేశ్వరుని ఆలయం చేరుకోవాలంటే పది కిలోమీటర్లు దట్టమైన అటవీ ప్రాంతంలో కొండ కోనలు దాటుకుంటూ వెళ్ళాలి. కాలినడకన తప్ప మరో మార్గం లేదు. అయితే ఇక్కడ శివరాత్రి రోజు మాత్రం జాతరగా ఉంటుంది. 10 కిలోమీటర్ల మేర దట్టమైన అటవీ ప్రాంతంలో భక్తులు శివనామస్మరణత చేస్తూ శివుడిని మల్లం కొండేశ్వర స్వామిని దర్శించుకుంటారు.