AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దాహం తీర్చుకోవడానికి గ్రామానికి వచ్చిన చుక్కల దుప్పికి ఏమైంది? చెరువు ఒడ్డున కనిపించిన మృతదేహం!

Stray Dogs Attack Deer: మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలోని పెద్దచెరువు సమీపంలో దాహం తీర్చుకునేందుకు వచ్చిన చుక్కల దుప్పిపై వీధి కుక్కలు దాడి చేయడంతో అది తీవ్ర గాయాల పాలై మృతి చెందింది. ఘటనాస్థలాన్ని పరిశీలించిన అటవీశాఖ అధికారులు పోస్టుమార్టం నిర్వహించి అనంతరం దహన సంస్కారాలు చేపట్టారు. నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి నీటి కోసం గ్రామ పరిసరాలకు వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు.

దాహం తీర్చుకోవడానికి గ్రామానికి వచ్చిన చుక్కల దుప్పికి ఏమైంది? చెరువు ఒడ్డున కనిపించిన మృతదేహం!
Stray Dogs Attack Deer
Fairoz Baig
| Edited By: |

Updated on: Jun 15, 2026 | 9:24 PM

Share

మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలోని పెద్దచెరువు సమీపంలో చుక్కల దుప్పిపై వీధి కుక్కలు దాడి చేశాయి. గ్రామ సమీపంలోని నీటి కుంటలో దాహం తీర్చుకునేందుకు వచ్చిన చుక్కల దుప్పిగా పిలుచుకునే పొడదుప్పిపై కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలతో దుప్పి కుంట ఒడ్డునే చనిపోయింది. నీటిని తాగేందుకు వచ్చిన క్రమంలోనే జింకపై కుక్కలు దాడి చేసి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు జింకని పరిశీలించి పోస్టుమార్టం నిర్వహించారు. నల్లమల్ల అటవీ ప్రాంతం అతి సమీపంలో ఉండడం వల్లే దాహం తీర్చుకునేందుకు చుక్కల దుప్పి ఈ ప్రాంతంలోకి వచ్చినట్లుగా అధికారులు అభిప్రాయపడుతున్నారు…

పెద్దచెరువు పంచాయతీ పరిధిలోని చెరువులో నీరు తాగేందుకు వచ్చి కుక్కల దాడిలో మృత్యువాత పడ్డ దుప్పిని అటవీశాఖ ధికారులు పరిశీలించారు. సబ్ డీఎఫ్వో బాలరాజు, డీఆర్వో వంశీ కృష్ణకుమారి, బీటు అధికారి కె. లక్ష్మానాయక్ దుప్పి కళేబరాన్ని పరిశీలించారు. అనంతరం పశువైద్యాధికారి దుప్పి కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం దుప్పికి దహనసంస్కారాలు నిర్వహించారు.

Follow Us
నల్లమల్ల నుంచి గ్రామంలోకి వచ్చిన చుక్కల దుప్పి.. చెరువు వద్ద..
నల్లమల్ల నుంచి గ్రామంలోకి వచ్చిన చుక్కల దుప్పి.. చెరువు వద్ద..
ఏం లిరిక్స్ భయ్యా.. 31 సంవత్సరాలుగా అందరూ ఈజీగా పాడేస్తున్న పాట..
ఏం లిరిక్స్ భయ్యా.. 31 సంవత్సరాలుగా అందరూ ఈజీగా పాడేస్తున్న పాట..
శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరిచిన ఉపగ్రహ ఫోటోలు.. ఆకాశంలో మారిన సీన్.
శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరిచిన ఉపగ్రహ ఫోటోలు.. ఆకాశంలో మారిన సీన్.
తాబేళ్లతో గూఢచర్యం! చైనా సముద్రంలో రహస్య యుద్ధం
తాబేళ్లతో గూఢచర్యం! చైనా సముద్రంలో రహస్య యుద్ధం
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది..
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది..
శ్రీవారి ప్రసాదాల్లో భారీ మార్పులు.. నాణ్యత, భద్రత కోసం...
శ్రీవారి ప్రసాదాల్లో భారీ మార్పులు.. నాణ్యత, భద్రత కోసం...
మిస్టరీగా మారిన మూడేళ్ల జాహ్నవి అదృశ్యం..అధికారుల విభిన్న వాదనలు!
మిస్టరీగా మారిన మూడేళ్ల జాహ్నవి అదృశ్యం..అధికారుల విభిన్న వాదనలు!
రోజుకు 200 లీటర్లే.. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు
రోజుకు 200 లీటర్లే.. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు
హైదరాబాద్ నుంచి ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ షేర్లు కొనొచ్చా?
హైదరాబాద్ నుంచి ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ షేర్లు కొనొచ్చా?
చ‌నిపోయిన భార్య‌పై ప్రేమ‌కు గుర్తుగా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ
చ‌నిపోయిన భార్య‌పై ప్రేమ‌కు గుర్తుగా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ