Railway News: ఆంధ్రప్రదేశ్‌ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ రూట్లలో రైళ్ల పునరుద్ధరణ..

|

Apr 11, 2022 | 5:14 PM

Railway News: ఏపీలోని రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త తెలిపింది. కరోనా (Corona), ఇతరత్రా కారణాలతో కొన్ని రూట్లలో నిలిచిపోయిన రైళ్ల సేవలను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే...

Railway News: ఆంధ్రప్రదేశ్‌ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ రూట్లలో రైళ్ల పునరుద్ధరణ..
South Central Railway
Follow us on

Railway News: ఏపీలోని రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త తెలిపింది. కరోనా (Corona), ఇతరత్రా కారణాలతో కొన్ని రూట్లలో నిలిచిపోయిన రైళ్ల సేవలను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే విశాఖపట్నం-విజయవాడ, గుంటూరు-డోన్‌ల మధ్య నిలిచిపోయిన పలు రైళ్లను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పునరుద్ధరించిన రైళ్లు ఏప్రిల్‌ 13వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

పునరుద్ధరించిన రైళ్లు ఇవే..

* ట్రెయిన్‌ నెంబర్‌ 22701 విశాఖటపట్నం నుంచి విజయవాడ వెళ్లే రైళు ఉదయం 5.25 గంటలకు ప్రారంభమై 11.10 గంటలకు చేరుకుంది. ఈ డబుల్‌ డెక్కర్‌ రైలు దువ్వాడ, అకనాపల్లి, తుణి, సామర్ల కోట, రాజమండ్రి, తాడేపల్లి గూడం, ఎలూరులో ఆగుతుంది.

* ట్రెయిన్‌ నెంబర్‌ 22702 విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే సర్వీస్‌ సాయంత్రం 05.30 గంటలకు వయలు దేరి రాత్రి 10.55 నిమిషాలకు చేరుకుంటుంది.

* ట్రెయిన్‌ నెంబర్‌ 17228 రైలు గుంటూరు నుంచి డోన్‌ వెళ్లే రైలు మధ్యాహ్నం 1.00 గంటకు బయలు దేరి రాత్రి 9.15 నిమిషాలకు చేరుకుటుంది.

* ట్రెయిన్‌ నెంబర్‌ 17227 డోన్‌ నుంచి గుంటూరు వెళ్లే రైలు ఉదయం 6.30 గంటలకు బయలు దేరి మధ్యాహ్నం 2.00 గంటలకు చేరుకుంటుంది.

Also Read: AP: అట్టుడుకుతున్న జగ్గయ్యపేట.. ఆ కోటరీ కారణంగానే పదవి రాలేదన్న ఉదయభాను

Knowledge: భారతదేశంలో జీరో మైల్‌స్టోన్‌ ఎక్కడుందో తెలుసా.? దీని వెనక ఉన్న అసలు చరిత్ర ఇదే..

Diabetes: భోజనంలో ఈ ఐదు ఆహారాలను చేర్చుకుంటే డయాబెటిస్‌ అదుపులో ఉన్నట్లే..!