ఏపీ ప్రయాణీకులకు అలెర్ట్.. భారీగా రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

| Edited By: Rajeev Rayala

Nov 21, 2023 | 8:54 PM

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ రైల్వే డివిజన్లో జరుగుతున్న పలు మరమ్మత్తు పనులు, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పలు రైళ్ల రాకపోకలను రద్దు చేయడంతో పాటు పాక్షికంగా రద్దు చేయడం, మరికొన్ని రైళ్లను మళ్ళించడం జరిగిందని రైల్వే అధికారులు సోమవారం విడుదల చేసిన ప్రకటనలు తెలిపారు. ఈనెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు

ఏపీ ప్రయాణీకులకు అలెర్ట్.. భారీగా రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
Train
Follow us on

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ రైల్వే డివిజన్లో జరుగుతున్న పలు మరమ్మత్తు పనులు, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పలు రైళ్ల రాకపోకలను రద్దు చేయడంతో పాటు పాక్షికంగా రద్దు చేయడం, మరికొన్ని రైళ్లను మళ్ళించడం జరిగిందని రైల్వే అధికారులు సోమవారం విడుదల చేసిన ప్రకటనలు తెలిపారు. ఈనెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు

ట్రైన్ నెంబర్ 17267 కాకినాడ పోర్ట్ – విశాఖపట్నం,

ట్రైన్ నెంబర్ 17268 విశాఖపట్నం-కాకినాడ పోర్టు,

ట్రైన్ నెంబర్ 07466 రాజమండ్రి – విశాఖపట్నం,

ట్రైన్ నెంబర్ 07467 విశాఖపట్నం-రాజమండ్రి,

ట్రైన్ నెంబర్ 17219 మచిలీపట్నం – విశాఖపట్నం

రైళ్లను రద్దు చేయడం జరిగిందన్నారు. ఈనెల 20 తేదీ నుండి 26వ తేదీ వరకు ట్రైన్ నంబర్ 17243 గుంటూరు రాయగడ రైళ్ రద్దు చేయడం జరిగిందన్నారు..

అలాగే 22702 విజయవాడ – విశాఖపట్నం ఈనెల 20, 21, 22, 24, 25 తేదీల్లో రద్దు చేశారు. అలాగే 22701 విశాఖపట్నం విజయవాడ ట్రైన్ ను ఈనెల 20, 21, 22, 24, 25 తేదీల్లో రద్దు చేసినట్లు తెలిపారు.

ట్రైన్ నెంబర్ 17239 గుంటూరు- విశాఖపట్నం,

ట్రైన్ నెంబర్ 07977 బిట్రగుంట – విజయవాడ,

ట్రైన్ నెంబర్ 07978 విజయవాడ – బిట్రగుంట,

ట్రైన్ నెంబర్ 07279 విజయవాడ-తెనాలి,

ట్రైన్ నెంబర్ 07575 తెనాలి – విజయవాడ,

ట్రైన్ నెంబర్ 07461 విజయవాడ – ఒంగోలు,

ట్రైన్ నెంబర్ 07576 ఒంగోలు – విజయవాడ,

ట్రైన్ నెంబర్ 07500 విజయవాడ – గూడూరు, ట్రైన్లను ఈనెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు రద్దు చేయడం జరిగిందని తెలిపారు.

అలాగే ట్రైన్ నెంబర్ 17237 బిట్రగుంట-చెన్నై సెంట్రల్, 17238 చెన్నైసెంట్రల్ బిట్రగుంట, ట్రైన్లను ఈ నెల 20 తేదీ నుండి 24వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

అలాగే ట్రైన్ నెంబర్ 07458 గూడూరు-విజయవాడ ట్రైన్ ఈనెల 21వ తేదీ నుండి 26వ తేదీ వరకు రద్దు చేసినట్లు తెలిపారు.

ట్రైన్ నెంబర్ 17220 విశాఖపట్నం – మచిలీపట్నం,

ట్రైన్ నెంబర్ 17244 రాయగడ-గుంటూరు ఎక్స్ప్రెస్,

ట్రైన్ నెంబర్ 17240 విశాఖపట్నం-గూడూరు ట్రైన్లను ఈనెల 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు రద్దు చేసినట్లు తెలిపారు.

పాక్షికంగా రద్దు చేసిన ట్రైన్లు…

ఈనెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ట్రైన్ నెంబర్ 07896 మచిలీపట్నం – విజయవాడ,

ట్రైన్ నెంబర్ 007769 విజయవాడ-మచిలీపట్నం,

ట్రైన్ నెంబర్ 07863 నరసాపూర్- విజయవాడ,

ట్రైన్ నెంబర్ 07866 విజయవాడ మచిలీపట్నం,

ట్రైన్ నెంబర్ 07770 మచిలీపట్నం – విజయవాడ,

ట్రైన్ నెంబర్ 07283 విజయవాడ-భీమవరం,

ట్రైన్ నెంబర్ 07870 మచిలీపట్నం-విజయవాడ,

ట్రైన్ నెంబర్ 07861 విజయవాడ – నరసాపూర్ ట్రైన్లను ఈనెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు పాక్షికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

పలు రైలు దారి మళ్లింపు..

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ రైల్వే డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులు మరమ్మత్తులు కారణంగా పలు రైలులను దారి మళ్లించినట్లు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ ఏలూరు మీదుగా వెళ్లే ట్రైన్లను విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు మీదుగా దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు.

ట్రైన్ నెంబర్ 22643 ఎర్నాకులం-పాట్నా ఈనెల 20వ తేదీన, ట్రైన్ నెంబర్ 12756 భావనగర్-కాకినాడ పోర్టు ఈనెల 25వ తేదీన, ట్రైన్ నెంబర్ 12509 బెంగళూరు -గౌహాటి ఈనెల 22, 24వ తేదీల్లో, ట్రైన్ నెంబర్ 11019 చత్రపతి శివాజీ టెర్మినల్- భువనేశ్వర్ ఈనెల 20, 22, 24, 25 తేదీల్లో విజయవాడ గుడివాడ భీమవరం నిడదవోలు మీదుగా మళ్లించడం జరిగిందన్నారు.

అలాగే ట్రైన్ నెంబర్ 13351 ధన్బాద్ -ఆల్ పూజ ఈనెల 20 నుండి 26 తేదీలలో ట్రైన్ నెంబర్ 18637 అటియ-బెంగళూరు ఈనెల 20వ తేదీ 25వ తేదీల్లో, ట్రైన్ నెంబర్ 12835 హతియా- బెంగళూరు ట్రైన్ ఈనెల 21,26 తేదీల్లో, ట్రైన్ నెంబర్ 1289 టాటా- బెంగళూరు ట్రైన్ ఈనెల 24వ తేదీన, ట్రైన్ నెంబర్ 18111 టాటా-యశ్వంతపూర్ ట్రైన్ ను ఈనెల 23వ తేదీన, ట్రైన్ నెంబర్ 12376 జై సిద్ – తంబరం ట్రైన్ ఈనెల 22వ తేదీన, ట్రైన్ నెంబర్ 22837 హట్యాయ-ఎర్నాకులం ఈనెల 20వ తేదీన నిడదవోలు భీమవరం గుడివాడ విజయవాడ మీదుగా దారి మళ్లించడం జరిగిందని తెలిపారు.