Special Trains: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ట్రైన్స్

|

Dec 24, 2022 | 4:36 PM

పండుగ నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్ల మీదుగా మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఆ వివరాలు మీ కోసం...

Special Trains: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ట్రైన్స్
Sankranti special trains
Follow us on

సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూర్లకి వెళ్లాలనుకుంటున్న ప్రయాణీకులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ రద్దీ దృష్ట్యా స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.  స్పెషల్ ట్రైన్స్‌లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించింది.

మచిలీపట్నం-కర్నూలు, మచిలీపట్నం-తిరుపతి,  విజయవాడ-నాగర్‌సోల్, కాకినాడ టౌన్-లింగంపల్లి, పూర్ణ-తిరుపతి, తిరుపతి-అకోలా,  మచిలీపట్నం-సికింద్రాబాద్  మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు వివరించారు. మచిలీపట్నం నుంచి కర్నూలు సిటీ (07067 రైలు )కి ప్రతీ శనివారం, మంగళవారం, గురువారం నడుస్తుంది. 2022 జనవరి 3,5,7,10, 12, 14, 17న మచిలీపట్నం నుంచి బయల్దేరుతుంది. మచిలీపట్నం, గుడివాడ జంక్షన్, విజయవాడ జంక్షన్, గుంటూరు జంక్షన్, నరసారావుపేట, దొనకొండ, మార్కాపూర్ రోడ్, కంబం, గిద్దలూరు, నంద్యాల, డోన్ స్టేషన్లలో ఆగుతుంది.  తిరుగు ప్రయాణంలో కర్నూలు సిటీ నుంచి మచిలీపట్నం వరకు ప్రతీ ఆదివారం, బుధవారం, శుక్రవారం వెళుతుంది. 2022 జనవరి 4, 6, 8, 11, 13, 15, 18న నడుస్తుంది.

మిగిలిన ప్రత్యే రైళ్ల వివరాలను దిగువన ట్వీట్‌లో చూడండి…

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..